హైదరాబాద్ (hyderabad) బద్వేల్ (budwel) సమీపంలో గురువారం భారీ అగ్నిప్రమాదం (fire accident) సంభవించింది. ఓ ఫ్లైవుడ్ గోదాంలో మంటలు ఎగసిపడుతున్నాయి. దట్టంగా మంటలు వ్యాపించడంతో కాలనీవాసులు పొగతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
హైదరాబాద్ (hyderabad) బద్వేల్ (budwel) సమీపంలో గురువారం భారీ అగ్నిప్రమాదం (fire accident) సంభవించింది. ఓ ఫ్లైవుడ్ గోదాంలో మంటలు ఎగసిపడుతున్నాయి. దట్టంగా మంటలు వ్యాపించడంతో కాలనీవాసులు పొగతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరోవైపు గోదాంలో ముగ్గురు కార్మికులు ఇరుక్కుపోయినట్లుగా తెలుస్తోంది. రంగంలోకి దిగిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేసేందుకు శ్రమిస్తున్నారు. అలాగే లోపల చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటల ధాటికి ఓ భవనం కూలేందుకు సిద్ధంగా వుంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
