సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం సంభవించింది. వింధ్యా ఆర్గానిక్ పరిశ్రమలో శనివారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కొద్ది క్షణాల వ్యవధిలోనే ఫ్యాక్టరీ మొత్తం అగ్నికీలలు కమ్మేశాయి.

భారీ శబ్ధంతో పేలుడు సంభవించడంతో కార్మికులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. లోపల కొంతమంది కార్మికులు చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. పేలుడు ధాటికి కొందరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో 20 మంది గాయపడగా, ముగ్గురి పరిస్ధితి విషమంగా వుంది.

కిలోమీటర్ల మేర పొగ దట్టంగా వ్యాపించింది. దీంతో ఏం చేయాలో తెలియక స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. పొగ కారణంగా శ్వాస అందక పలువురు సొమ్మసిల్లి పడిపోయినట్లుగా తెలుస్తోంది.