అబిడ్స్‌లోని ఓ ప్రైవేట్ హైస్కూల్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్క్రాప్‌ రూమ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దట్టమైన పొగ అలుముకుంది. పొగ ధాటికి ఏడుగురు విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

హైదరాబాద్: అబిడ్స్‌లోని ఓ ప్రైవేట్ హైస్కూల్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్క్రాప్‌ రూమ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దట్టమైన పొగ అలుముకుంది. పొగ ధాటికి ఏడుగురు విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

ప్రమాదం జరిగిన సమయంలో స్కూల్‌లో 2 వేల మంది విద్యార్థులు ఉన్నారు. అయితే స్కూల్ సిబ్బంది మంటలను చూసిన వెంటనే సకాలంలో స్పందించడంతో భారీ ప్రమాదం తప్పింది. లేకపోతే తీవ్ర నష్టం జరిగేది.