సికింద్రాబాద్‌ రూబీ హోటల్‌ కింది ఫ్లోర్‌లో వున్న ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంటల ధాటికి బైకులు తగలబడుతున్నాయి

సికింద్రాబాద్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక రూబీ హోటల్‌ కింది ఫ్లోర్‌లో వున్న ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంటల ధాటికి బైకులు తగలబడుతున్నాయి. పై అంతస్తులో వున్న లాడ్జిలో కొందరు చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. వారిని కాపాడేందుకు పోలీసులు, స్థానికులు ప్రయత్నిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred