హైదరాబాద్: నగరంలోని ఆదర్శ్‌నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టుగా అధికారులు చెబుతున్నారు. ఫైరింజన్లు మంటలను ఆర్పుతున్నాయి.

ఎమ్మెల్యే క్వార్టర్స్ లోని 180 గదిలో ఆకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి.  ఈ మంటల్లో పెద్ద ఎత్తున వస్తువులు కాలిపోయాయి. విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మంటలను ఆర్పుతున్నారు.