Asianet News TeluguAsianet News Telugu

కాషాయ శ్రేణుల విజయోత్సవాల్లో అపశృతి.. హైదరాబాద్ బీజేపీ ఆఫీస్ వద్ద అగ్నిప్రమాదం

గుజరాత్‌లో బీజేపీ ఘన విజయంతో దేశ వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయం వద్ద కార్యకర్తలు కాల్చిన టపాసుల కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. 

fire accident at bjp office in hyderabad
Author
First Published Dec 8, 2022, 4:35 PM IST

హైదరాబాద్‌లోని తెలంగాణ బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద అగ్నిప్రమాదం సంభవించింది. గుజరాత్‌లో బీజేపీ గెలిచిందన్న ఆనందంతో పార్టీ కార్యకర్తలు బాణాసంచా కాల్చారు. దీంతో అవి పక్కనే వున్న ఫ్లెక్సీలపై పడ్డాయి. వెంటనే భారీగా పొగలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అయితే అగ్నిప్రమాదంతో బీజేపీ నేతలు కార్యకర్తలు భయాందోళనలకు గురయ్యారు. 

ALso REad:గుజరాత్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న భూపేంద్ర పటేల్.. ముహుర్తం ఖరారు.. హాజరుకానున్న మోదీ, షా..

ఇకపోతే... గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న బీజేపీ.. అక్కడ వరుసగా ఏడోసారి ప్రభుత్వాన్ని  ఏర్పాటు చేసేందుకు సిద్దమైంది. గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ రెండోసారి ప్రమాణ  స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు బీజేపీ నాయకులు వివరాలు వెల్లడించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు కూడా భూపేంద్ర పటేల్ ప్రమాణ  స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సీఆర్ పాటిల్ తెలిపారు. భూపేంద్ర పటేల్ ప్రమాణ  స్వీకార కార్యక్రమం డిసెంబర్ 12వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు జరుగుతుందని చెప్పారు. గుజరాత్ వ్యతిరేక శక్తులన్నింటినీ రాష్ట్ర ప్రజలు ఓడించారని కూడా కామెంట్ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios