హైదరాబాద్ బంజారాహిల్స్ లో స్కైబ్లూ హోటల్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. హోటల్ మూడో అంతస్తులో హటాత్తుగా మంటలు చెలరేగాయి. అంతకంతకు మంటలు విజృంభించి ఆ అంతస్తులోని అన్ని గదులను దహనం చేశాయి. 

మంటలను గమనించిన హోటల్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. 

ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. అయితే హోటల్లోని విలువైన ఫర్నీచర్  కాలిబూడిదవడంతో భారీగా ఆస్తినష్టం జరిగినట్లు హోటల్ యాజమాన్యం తెలిపింది.