తెలంగాణ పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజ్ కేసుకు సంబంధించి టీ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌‌ను అరెస్ట్ చేయడం తీవ్ర సంచలనంగా మారింది. అయితే బండి సంజయ్‌పై హన్మకొండలోని కమలాపూర్‌‌తో పాటు కరీంనగర్ పోలీసు స్టేషన్‌‌లో కూడా కేసు నమోదైంది.

తెలంగాణ పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజ్ కేసుకు సంబంధించి టీ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌‌ను అరెస్ట్ చేయడం తీవ్ర సంచలనంగా మారింది. అయితే బండి సంజయ్‌పై హన్మకొండలోని కమలాపూర్‌‌తో పాటు కరీంనగర్ పోలీసు స్టేషన్‌‌లో కూడా కేసు నమోదైంది. కరీంనగర్‌ టూ టౌన్ పోలీసు స్టేషన్‌లో సీఆర్‌పీసీ 151 సెక్షన్ కింద బండి సంజయ్‌ మీద కేసు నమోదు చేశారు. కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ టీ లక్ష్మిబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. వాట్సాప్‌లో పదో తరగతి పరీక్ష ప్రశ్నపత్రం లీక్‌పై బీజేపీ కార్యకర్తల నిరసనలు, రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం కలిగించే నిరసనలకు విద్యార్థులను రెచ్చగొట్టడానే ఆరోపణలపై బండి సంజయ్‌పై కేసు నమోదు చేశారు. 

‘‘ ఇటీవలి కాలంలో వికారాబాద్‌, హన్మకొండ జిల్లా కమలాపూర్‌లలో ఎస్‌ఎస్‌సీ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీకి సంబంధించి పలు వార్తాపత్రికల్లో వార్తలు వెలువడ్డాయి. ఇలా జరిగిన వెంటనే కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ లీకేజీకి ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ ప్రెస్ నోట్స్, వివిధ సోషల్ మీడియా‌ పోస్టులు చేయడం ప్రారంభించారు. అమాయక విద్యార్థులను వివిధ నిరసన చర్యలకు ఆశ్రయించేలా రెచ్చగొట్టి, విద్యార్థులను రెచ్చగొట్టి ప్రవర్తించేలా చేయడం వల్ల ప్రజా శాంతి మరియు ప్రశాంతతకు భంగం కలిగించే అవకాశం ఉంది

తదుపరి పరీక్షల నిర్వహణకు మరియు కొనసాగింపుకు భంగం కలిగించేలా బండి సంజయ్ తన అనుచరులను, బీజేపీ కార్యకర్తలను పరీక్షా కేంద్రాల ముందు ధర్నాలకు కూడా ప్రేరేపించినట్లు సమాచారం అందింది. బండి సంజయ్ ఇటువంటి చర్యలు హాజరయ్యే విద్యార్థులను నిరుత్సాహపరిచే అవకాశం ఉంది. ఈ సందర్భంలో విద్యార్థులు తీవ్ర చర్యలను ఆశ్రయించే అవకాశం ఉంది. ఈ పరిణామాలు పరీక్షల నిర్వహణపై ప్రభావం చూపడంతో పాటు..విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

ప్రశ్న పత్రాల లీకేజీకి సంబంధించి కమలాపూర్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రస్తుతం జరుగుతున్న ఎస్‌ఎస్‌సీ పరీక్షలను శాంతియుతంగా నిర్వహించడం, విద్యార్థుల భవిష్యత్తు కోసం బండి సంజయ్ కుమార్‌ను ప్రివేన్షన్ అరెస్టు చేయడం జరిగింది’’ అని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.