Asianet News TeluguAsianet News Telugu

ట్విట్టర్ ఎఫెక్ట్.. మేయర్ బొంతు కి జరిమానా

జీహెచ్ఎంసీ( గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్) మేయర్ బొంతు రామ్మోహన్ కి ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు.

fine for ghmc mayor bonthu rammohan over not following traffic rules
Author
Hyderabad, First Published Feb 2, 2019, 10:55 AM IST

జీహెచ్ఎంసీ( గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్) మేయర్ బొంతు రామ్మోహన్ కి ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన కేసులో ఆయన పోలీసులు జరిమానా విధించారు.

మేయర్ బొంతు రామ్మోహన్..  ఏపీ09 సీ9969 నంబర్ గల ఫార్చునర్ వాహనంలో గురువారం మధ్యాహ్నం మాదాపూర్ వెళ్లారు. ఇనార్బిట్ మాల్ సమీపంలోని ఐ ల్యాబ్ వద్ద మధ్యాహ్నం 12గంటల 55నిమిషాలకు నో పార్కింగ్ బోర్డ్ ఉన్న చోట ఆయన తన కారును పార్క్ చేశారు. దీనిని గమనించిన ఓ నెటిజన్ ఫోటో తీసి సైబరాబాద్ ట్రాఫిక్, సైబరాబాద్ పోలీస్, తెలంగాణ డీజీపీకి ట్విట్టర్ లో ఫిర్యాదు చేశారు.

ఆ ట్వీట్ పై స్పందించిన సైబరాబాద్ పోలీసులు తమ ట్రాఫిక్ విభాగానికి ఆ ఫోటోని రీట్వీట్ చేశారు. దీంతో సైబరారబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పందించి మేయర్ వాహనానికి చలానా విధించారు. రోడ్డు భద్రతను మెరుగుపరచడంలో భాగస్వామ్యం అవుతున్న నెటిజన్లకు ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు దన్యవాదాలు తెలిపారు. చట్టం ముందు అందరూ సమానమేనని పోలీసులు నిరూపించారంటూ నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios