Asianet News TeluguAsianet News Telugu

రూ. 2.9 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్.. శాసనసభలో బ‌డ్జెట్ ప్రవేశ‌పెట్టిన మంత్రి హ‌రీశ్‌రావు..

తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టారు. 

Finance Minister Harish Rao present Telangana Budget 2023 with 2.90 lakhs crores
Author
First Published Feb 6, 2023, 10:42 AM IST

తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ రోజు ఉదయం 10.30 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే.. శాసనసభలో బడ్జెట్‌ను ప్రసంగాన్ని ప్రారంభించారు. 2023-24 ఏడాదికి రూ. 2,90,396 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రతిపాదించారు. తెలంగాణ ఏర్పడినప్పుడు రాష్ట్ర పరిస్థితి దయనీయంగా ఉందని హరీష్ రావు అన్నారు. నేడు తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుంది అనే స్థాయికి రాష్ట్రం చేరుకుందని చెప్పారు. ఇది రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణం అని అన్నారు. సంక్షోభ స‌మ‌యాల్లో స‌మ‌ర్థ‌వంతంగా ఆర్థిక నిర్వ‌హ‌ణ‌తో తెలంగాణ మ‌న్న‌న‌లు పొందిందని తెలిపారు. 

కేంద్రం ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రగతికి కేంద్రం అడ్డంకులు సృష్టిస్తోందని విమర్శించారు. రాస్ట్ర రుణపరిమితిని కేంద్రం అసంబద్దంగా తగ్గించిందని మండిపడ్డారు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్దంగా కేంద్రం ఆంక్షలు పెడుతోందని విమర్శించారు. ఆర్థిక సంఘం సిఫారసులను కేంద్రం పక్కకు పెట్టిందని ఆరోపించారు. 

దేశంలోని కొన్ని రాజకీయ పక్షాలు ప్రజా సంక్షేమ పథకాలను అవహేళన చేస్తున్నాయని విమర్శించారు. ఉచితాలు అని అనుచితంగా వ్యాఖ్యలు చేస్తున్నాయని అన్నారు. ప్రతిదానిని లాభానష్టాలతో చూసేందుకు పరిపాలన అనేది వ్యాపారం కాదని అన్నారు. సంక్షేమ పథకాలను మానవ అభివృద్ది దృక్పథంతో చూడాలని చెప్పారు.  

బడ్జెట్ విషయానికి వస్తే.. రెవెన్యూ వ్య‌యం రూ. 2,11,685 కోట్లు, మూల ధన వ్య‌యం రూ. 37,525 కోట్లు, వ్య‌వ‌సాయానికి కేటాయింపులు రూ. 26,831 కోట్లు,  పల్లె ప్రగతి, పంచాయితీరాజ్‌‌కు రూ. 31,426 కోట్లు, నీటిపారుద‌ల శాఖ‌కు రూ. 26,885 కోట్లు, విద్యుత్ కేటాయింపులు రూ. 12,727 కోట్లు, ఆసరా పెన్షన్ల కోసం రూ. 12,000 కోట్లు, దళిత బంధు పథకానికి రూ. 17,700 కోట్లు, ఎస్సీ ప్రత్యేక నిధి కోసం రూ. 36,750 కోట్లు, గిరిజన సంక్షేమం, ప్రత్యేక ప్రగతి నిధికి రూ. 15,233 కోట్లు, బీసీ సంక్షేమం కోసం రూ. 6, 229 కోట్లు, మహిళా, శిశు సంక్షేమం కోసం రూ. 2,131 కోట్లు, మైనార్టీ సంక్షేమం కోసం రూ. 2,200 కోట్లు, విద్య రంగానికి రూ. 19, 093 కోట్లు, వైద్య, ఆరోగ్య శాఖకు రూ. 12,161 కోట్లు ప్రతిపాదించారు.

ఇంకా.. ప్రజాపంపిణీ వ్యవస్థకు రూ. 3,117 కోట్లు, ఆయిల్ ఫామ్‌కు రూ. 1,000 కోట్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు రూ. 3,210 కోట్లు, రుణమాఫీ పథకానికి రూ. 6,385 కోట్లు, హరితహారం పథకానికి రూ. 1,471 కోట్లు, పురపాలక శాఖకు రూ. 11,372 కోట్లు, రోడ్లు, భవనాల శాఖకు రూ. 2,500 కోట్లు, పరిశ్రమల శాఖకు రూ. 4,037 కోట్లు, హోం శాఖకు రూ. 9,599 కోట్లు, రైతు బంధు పథకానికి రూ. 1,575 కోట్లు, రైతు బీమా పథకానికి రూ. 1,589 కోట్లు, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకానికి రూ. 200 కోట్లు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకానికి రూ. 12,000 కోట్లు, ఆరోగ్యశ్రీ పథకానికి రూ. 1,463 కోట్లు, అట‌వీ శాఖ, హరితహారంకు రూ. 1,471 కోట్లు, ప్ర‌ణాళిక విభాగానికి రూ. 11,495 కోట్లు, ఐటీ, క‌మ్యూనికేష‌న్ల శాఖ‌కు రూ. 366కోట్లు, 

కేసీఆర్ న్యూట్రీషన్ కిట్ కోసం రూ. 200 కోట్లు, పురపాలక శాఖ కు 11, 372 కోట్లు, డ‌బుల్ బెడ్రూమ్ ఇండ్ల ప‌థ‌కానికి రూ. 12,000 కోట్లు, రుణ‌మాఫీ ప‌థ‌కానికి రూ. 6,385 కోట్లు, ప్రభుత్వ ప్రకటనలకు రూ. 1,000 కోట్లు, కాళేశ్వరం టూరిజం సర్క్యూట్‌కు రూ. 750 కోట్లు, సుంకేశుల ఇన్‌టెక్‌ ప్రాజెక్టు కోసం రూ. 725 కోట్లు, యాదాద్రి డెవలప్‌మెంట్‌ అథారిటీ కోసం రూ. 200 కోట్లు, ఎస్సీ సంక్షేమ శాఖకు రూ. 21,022 కోట్లు, ఆర్టీసీ సంస్థ అభివృద్ధికి రూ. 1500 కోట్లు, మూసీ రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధికి రూ. 200 కోట్లు, మహిళా వర్సిటీకి రూ. 100 కోట్లు, ఓల్డ్ సిటీ మెట్రో రైలు కనెక్టివిటీ కోసం రూ. 500 కోట్లు, యూనివర్సిటీల అభివృద్ధికి రూ. 500 కోట్లు, స్పెషల్ డెవలప్‌మెంట్‌ ఫండ్‌కు రూ.10,348 కోట్లు మెట్రో రైల్‌ ప్రాజెక్టు కోసం రూ. 1500 కోట్లు, ఎయిర్‌పోర్టు మెట్రో కనెక్టివిటీ కోసం రూ. 500 కోట్లు, కొత్తగా నియమించే ఉద్యోగుల జీతభత్యాలకు రూ. 1000 కోట్లు ప్రతిపాదించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios