Asianet News TeluguAsianet News Telugu

జీహెచ్ఎంసీ ఎన్నికలు: వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాలివే..!!

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా వార్డుల వారీగా తుది పోలింగ్ కేంద్రాల జాబితాను శనివారం జీహెచ్‌ఎంసీ ఎన్నికల అధికారి లోకేశ్‌ కుమార్‌ విడుదల చేశారు. 

final list of ghmc polling stations ksp
Author
Hyderabad, First Published Nov 21, 2020, 8:55 PM IST

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా వార్డుల వారీగా తుది పోలింగ్ కేంద్రాల జాబితాను శనివారం జీహెచ్‌ఎంసీ ఎన్నికల అధికారి లోకేశ్‌ కుమార్‌ విడుదల చేశారు.

గ్రేటర్‌లో మొత్తం 9,101 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. కొండాపూర్ డివిజన్‌లో అత్యధికంగా 99 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాట్లు చేశారు.

అత్యల్పంగా రామచంద్రాపురం డివిజన్‌లో 33 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ స్టేషన్ల ముసాయిదా జాబితాను ఇటీవల జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ విడుదల చేశారు.

ఏవైనా అభ్యంతరాలు, సలహాలు, సూచనలంటే ఈ నెల 17వ తేదీలోగా తెలియజేయాలని సూచించారు. దీంతో వచ్చిన క్లెయిమ్‌లను పరిశీలించి ఇవాళ తుది పోలింగ్ స్టేషన్ల జాబితా ప్రకటించారు.

గతంలో 1,500 మంది ఓటర్లకు ఒకటి చొప్పున పోలింగ్‌ కేంద్రాలు ఉండగా, ప్రస్తుతం కరోనా పరిస్థితుల్లో సుమారు ప్రతి వెయ్యి మందికి ఒకటి కేటాయించారు. దీంతో పోలింగ్‌ కేంద్రాల సంఖ్య 9,101కి పెరిగింది. 

Follow Us:
Download App:
  • android
  • ios