Asianet News TeluguAsianet News Telugu

కూతురు ఫ్రెండ్ ను ఈ సినీ నిర్మాత ఏం చేశాడంటే ?

  • కూతురి ఫ్రెండ్ నే వంచించిన నిర్మాత
  • బాలీవుడ్ లో సంచలనం సృష్టించిన ఘటన
  • హైదరాబాద్ పోలీసుల చేతిలో చిక్కి జైలుపాలు
film producer arrest in hyderabad

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు తెరకెక్కించిన బాలీవుడ్ ప్రముఖ నిర్మాతగా పేరు తెచ్చుకున్నాడాయన. కానీ చిన్న పాటి వక్ర బుద్ధి ఆయనను కటకటాలపాలు చేసింది. సినిమాల్లో ఛాన్స్ ఇస్తారా అంకుల్ అని ఆ నిర్మాతను తన కూతురు ఫ్రెండ్ అడిగింది. తన కూతురు స్నేహితురాలు అని చెబుతున్నది కాబట్టి ఒకే అనేశాడు ఆ నిర్మాత. అంతేకాదు ఏకంగా బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ సినిమాలోనే చాన్స్ ఇప్పిస్తానని నమ్మించాడు. హామీ ఇచ్చాడు. ఆ యువతి కూడా హ్యాపీగా ఫీలైంది. కానీ ఆ మనిషిలోని రాక్షసత్వం బయటకొచ్చింది. దీంతో  ఆ యువతిని లొంగదీసుకున్నాడు. అలా రెండేళ్లకు పైగా వాడుకున్నాడు.

కాలం గడుస్తున్నా సినిమాల్లో వేశాలు ఇప్పించలేదు. ఈ ఘటన 2015లో జరిగింది. అప్పటి నుంచి మూడేళ్ల పాటు ఆ యువతిని పలుమార్లు అత్యాచారం చేస్తూనే ఉన్నాడు ఆ నిర్మాత. మూడేళ్ల క్రితం మొదలైన ఈ కథ హైదరాబాద్ లో ప్రారంభమైంది తుదకు హైదరాబాద్ లోనే ముగింపు అయింది. జూలై 2015న షారుక్‌ ఖాన్‌, కాజోల్‌ నటించిన దిల్‌వాలే సినిమా చిత్రీకరణ రామోజీ ఫిలింసిటీలో జరిగింది. ఆ సినిమాకు కరీం మొరానీ సహ నిర్మాత. ఆ సమయంలో ముంబైకి చెందిన ఓ యువతి సినిమాలో అవకాశం కల్పించాలని కరీం మొరానీని కలిసింది. అవకాశం ఇస్తానంటూ అతడు ఆశ చూపాడు. హైదరాబాద్‌కు పిలిపించుకొని ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు. ముంబైలో కూడా కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి అత్యాచారం చేశాడు. అంతేకాదు బాధితురాలి నగ్న చిత్రాలను సెల్‌ఫోన్‌లో తీసి బెదిరించినట్లు తెలిసింది.

ఇదిలా ఉండగా ఈ ఘటనపై ఫిర్యాదు చేసేందుకు వెళితే ముంబై పోలీసులు తమ పరిధిలోకి రాదని చెప్పారు. హైదరాబాద్ లోనే ఫిర్యాదు చేసుకోండి అని చెప్పారు. దీంతో ఆమె ఈ నెల 10న రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్ ను  కలిసింది. సీపీ ఆదేశంతో నిర్మాత కరీం మొరానీపై ఐపీసీ 417, 376, 342, 506, 354 నిర్ఛయ యాక్ట్‌ కింద హయతనగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. కరీం మొరానీ 2జీ స్పెక్ట్రం కేసులో కూడా నిందితుడు.

బాధితురాలు నిర్మాత కీరం మొరానీ కూతురుకు దగ్గరి స్నేహితురాలని, ఆ సమయంలోనే వీరికి పరిచయం ఏర్పడిందని తెలిసింది. ఏడాదిన్నరగా చిత్రహింసలకు గురిచేసినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. చెన్నై ఎక్స్‌ప్రెస్‌, దమ్‌, యోధా చిత్రాలకు నిర్మాతగా, దిల్‌వాలే, హ్యాపీ న్యూఇయర్‌, రావణ్‌, చిత్రాలకు సహనిర్మాతగా వ్యవహరించాడు కరీం మొరానీ. 

మొత్తానికి పాపులర్ సినీ నిర్మాతగా పేరు తెచ్చుకున్న కరీం  మొరానీ తుదకు తన కూతురు లాంటి ఆడపిల్లను లోబర్చుకుని అత్యాచారం చేసి, వేధించి తుదకు కటకటాలపాలయ్యాడు. అదీ హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. 14 రోజుల రిమాండ్ కు తరలించారు. ఈ కేసు నుంచి తప్పించుకునేందకు సుప్రీంకోర్టు మెట్లెక్కినా కరీం మొరానీ కి న్యాయదేవత కరుణించలేదు కాబట్టే జైలు గూటికి చేరిండు. 

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

film producer arrest in hyderabad
Follow Us:
Download App:
  • android
  • ios