Asianet News TeluguAsianet News Telugu

ఫ్లెక్సీలో రఘనందన్ రావు పేరు మిస్సింగ్.. హరీశ్‌రావు సమక్షంలోనే టీఆర్ఎస్- బీజేపీ నేతల ఘర్షణ

మంత్రి హరీశ్ రావు సిద్ధిపేట జిల్లా పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫ్లెక్సీలో ఎమ్మెల్యే రఘనందన్ రావు ఫోటో ఎందుకు పెట్టలేదని బీజేపీ కార్యకర్తలు ప్రశ్నించారు. దీంతో బీజేపీ శ్రేణులు- టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. 
 

fighting between trs and bjp mlas infront of minister harishrao
Author
First Published Oct 7, 2022, 4:46 PM IST

మంత్రి హరీశ్ రావు సిద్ధిపేట జిల్లా పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్బర్ పేట్- భూంపల్లిలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. డీసీసీబీ బ్యాంక్ ప్రారంభోత్సవానికి మంత్రి హరీశ్ రావుతో పాటు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా హాజరయ్యారు. అయితే ఫ్లెక్సీలో ఎమ్మెల్యే ఫోటో ఎందుకు పెట్టలేదని బీజేపీ కార్యకర్తలు ప్రశ్నించారు. దీంతో బీజేపీ శ్రేణులు- టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. మంత్రి హరీశ్ రావు ముందే వీరు గొడవపడ్డారు. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్ధితిని అదుపులోకి తీసుకొచ్చారు. 

అంతకుముందు మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ... బోరు బావులకు మీటర్లు పెట్టలేదని, తెలంగాణకు రావాల్సిన రూ.12 వేల కోట్లను కేంద్రం నిలిపివేసిందని ఆరోపించారు. మీటర్ల మాట నిజం కాదని బీజేపీ నేతలు అంటున్నారని.. అయితే రూ.12 వేల కోట్లు ఎందుకు ఆపారో చెప్పాలని హరీశ్ డిమాండ్ చేశారు. కేంద్రం రాష్ట్రాలకు కోతలు, వాతలే తప్ప... ఇచ్చిందేమి లేదని ఎద్దేవా చేశారు. 15 రోజుల్లో బీఆర్ఎస్‌కు ఈసీ ఆమోదముద్ర వేస్తుందని.. టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మారనుందన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios