ఈ బిడ్డ నాకు పుట్టలేదన్న భర్త.. భార్య ఏం చేసిందంటే...

https://static.asianetnews.com/images/authors/d7f5adfb-1610-5d53-be8e-55db5850d97e.jpg
First Published 28, Aug 2018, 10:12 AM IST
fight between wife and husband in mehadipatnam
Highlights

భార్యపై అనుమానం వ్యక్తం చేసిన భర్త.. బిడ్డ తనకు పుట్టలేదని అనడంతో ఆమె ఆగ్రహావేశానికి గురైంది. నడిరోడ్డుపైనే భర్తను నిలదీసింది. 

భర్త అనుమానించాడని.. కన్నబిడ్డను ఓ తల్లి రోడ్డు మీదకు విసిరేసింది. ఈ దారుణ సంఘటన హైదరాబాద్ నగరంలోని మోహదీపట్నంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

మెహదీపట్నంలో సోమవారం రాత్రి.. ఇద్దరు భార్య, భర్తలు రోడ్డుపై ఘర్షణకు దిగారు. భార్యపై అనుమానం వ్యక్తం చేసిన భర్త.. బిడ్డ తనకు పుట్టలేదని అనడంతో ఆమె ఆగ్రహావేశానికి గురైంది. నడిరోడ్డుపైనే భర్తను నిలదీసింది. నన్నే అనుమానిస్తావా? అంటూ బిగ్గరగా అరుస్తూ హల్‌చల్‌ సృష్టించింది. 

భర్త చేతుల్లో ఉన్న బిడ్డను లాక్కుని రోడ్డుపై పడేసింది. దీంతో భర్త వెంటనే స్పందించి బిడ్డను అక్కున చేర్చుకున్నాడు. భార్యపై చేయి చేసుకున్నాడు. ఈ ఘటనతో మెహదీపట్నంలో గందరగోళం నెలకొంది. రోడ్డుపైనే దంపతులు వాదులాడుకోవడంతో వాహనదారులు ఏం జరుగుతుందో తెలీక ఆందోళనకు గురయ్యారు. అక్కడే విధుల్లో ఉన్నా ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ గొడవ పడుతున్న భార్యభర్తలను సముదాయించాడు. బిడ్డను భర్త చేతుల్లో పెట్టి వారిని అక్కడి నుంచి పంపించివేశాడు.

loader