Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు : లైవ్ డిబేట్‌.. బీజేపీ అభ్యర్ధి గొంతు పట్టుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకా

కుత్బుల్లాపూర్‌లో గెలుపెవరిది డిబేట్ కార్యక్రమం జరిగింది. ఈ చర్చకు ఎమ్మెల్యే కేపీ వివేకానంద, బీజేపీ అభ్యర్ధి కూన శ్రీశైలం గౌడ్ హాజరయ్యారు. సహనం కోల్పోయిన ఎమ్మెల్యే వివేకానంద ఆగ్రహంతో ఊగిపోయారు. శ్రీశైలం గౌడ్ గొంతును పట్టుకున్నారు

fight between brs mla kp vivekananda and bjp candidate kuna srisailam goud in live debate ksp
Author
First Published Oct 25, 2023, 9:24 PM IST | Last Updated Oct 25, 2023, 9:42 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వాడి వేడిగా జరుగుతున్నాయి . ముఖ్యంగా ప్రధాన పార్టీల అభ్యర్ధులు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఈ క్రమంలో తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ గెలుపెవరిది పేరిట ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్ధులు వారు గెలిస్తే ఏం చేస్తారు అనే దానిని ప్రజలకు వివరించేలా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. దీనిలో భాగంగా బుధవారం కుత్బుల్లాపూర్‌లో గెలుపెవరిది డిబేట్ కార్యక్రమం జరిగింది. ఈ చర్చకు ఎమ్మెల్యే కేపీ వివేకానంద, బీజేపీ అభ్యర్ధి కూన శ్రీశైలం గౌడ్ హాజరయ్యారు. 

ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య మాటల యుద్ధం జరిగి, అది కాస్తా ఘర్షణకు దారి తీసింది. ఒకానొక దశలో సహనం కోల్పోయిన ఎమ్మెల్యే వివేకానంద ఆగ్రహంతో ఊగిపోయారు. శ్రీశైలం గౌడ్ గొంతును పట్టుకున్నారు. అటు ఇరు పార్టీల కార్యకర్తల మధ్య గొడవ జరగ్గా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో కాసేపు ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. దీనికి సంబంధించిన వీడియోను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేశారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios