బస్సులో సీటు కోసం మళ్లీ ఫైట్.. జుట్టు పట్టుకొని కొట్టుకున్న మహిళలు.. వీడియో వైరల్..
బస్సుల్లో సీటు కోసం పలువురు మహిళలు ఘోరంగా కొట్టుకున్నారు. జుట్టు పట్టుకొని మరీ గొడవ పడ్డారు. ముథోల్ లో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తెలంగాణలో మహిళల ఉచిత బస్సు ప్రయాణం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చి మహాలక్ష్మీ పథకం మొదటి నుంచీ వార్తల్లో నిలుస్తోంది. ఈ ఉచిత బస్సు సౌకర్యం ప్రారంభమైన దగ్గర నుంచి మహిళలు సీట్ల కోసం గొడవ పడుతున్న గొడవలు ఎక్కువవుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి.
ఆకాశ్ ఎన్ జీ క్షిపణి పరీక్ష విజయవంతం.. ఏమిటీ ఎన్ జీ.. ? దానితో ఉపయోగాలేంటి ?
తాజాగా ముథోలోనూ ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. పలువురు మహిళలు సీటు కోసం ఫైట్ చేసుకున్నారు. ఒకరితో ఒకరు గొడవ పడ్డారు. జుట్టు పట్టుకొని కొట్టుకున్నారు. ఇతర ప్రయాణికులు, కండక్టర్ వారిని ఆపేందుకు ఎంతో ప్రయత్నించారు. కానీ చాలా సేపు వారు అలాగే పోట్లాడుతూ ఉన్నారు. దీంతో ఆ బస్సు ఆరగంట పాటు ఆగిపోయింది.
అయితే కొంత సమయం తరువాత ఇతర ప్రయాణికులు, కండక్టర్ వారికి నచ్చజెప్పారు. దీంతో గొడవ సద్ధుమణిగింది. కాగా.. మహిళల మధ్య జరిగిన ఘర్షణను పలువురు తమ సెల్ ఫోన్ లలో వీడియో తీశారు. దానిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో ఇప్పుడది వైరల్ గా మారింది.
అయోధ్యకు తొలి విమానం.. రాముడు, సీత, హనుమంతుడి వేషధారణలో ప్రయాణికులు.. వీడియో వైరల్
ఈ ఏడాది జనవరి 1వ తేదీన జహీరాబాద్ కూడా ఇలాంటి ఘటనే జరిగింది. సీటు కోసం మొదలైన ఘర్షణలో పలువురు మహిళలు ఒకరి జుట్టు మరొకరు పట్టుకొని కొట్టుకున్నారు. అయితే వారితో పాటు బస్సుల్లో వచ్చిన ఓ చిన్నారి గుక్క పెట్టి ఏడ్చింది. ఆ ఘర్షణను కూడా ఆ బస్సులో ఉన్న ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఆ సమయంలో అది వైరల్ అయ్యింది.
శంకరాచార్యుల సలహాలు, మతపరమైన పద్దతులు విస్మరించి రామాలయ ప్రారంభం - కాంగ్రెస్
కాగా.. మహిళలకు ఈ ఉచిత బస్సు ప్రయాణం మొదలైన తరువాత బస్సుల్లో రద్దీ పెరిగింది. ఆర్టీసీ బస్సుల ఆక్యుపెన్సీ పెరుగుతోంది. గతంలో 69 శాతం ఉన్న ఈ రేషియో ఇప్పుడు 89 శాతానికి పెరిగిందని తెలుస్తోంది. గతంలో ఆర్టీసీ బస్సుల్లో 12 నుంచి 14 లక్షల మంది ప్రయాణిస్తుండగా.. ఇప్పుడు ఇప్పుడు 29 లక్షలకు చేరింది.