ఓ తండ్రి పైశాచికత్వానికి కొడుకు బలయ్యాడు. మద్యానికి డబ్బులు తేలేదని 13యేళ్ల కొడుకు మీద వేడినూనె పోశాడు. ఈ దారుణ ఘటన మంచిర్యాలలో చోటు చేసుకుంది.
మంచిర్యాల : పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ.. వారి భవిష్యత్తు తీర్చిదిద్దాల్సిన తల్లిదండ్రులే liquorకి బానిసై.. వారిని చిత్రహింసలకు గురిచేస్తే.. ఊహించుకోవడానికి భయంకరంగా అనిపిస్తుంది కదా… అలాంటి ఓ సంఘటన ఆదివారం mancherial జిల్లా కాసిపేట మండలంలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దేవాపూర్ గ్రామానికి చెందిన 13 ఏళ్ల చిన్నారి అబ్బూ.. ఇతని తల్లిదండ్రులు మద్యానికి బానిసయ్యారు. ఏ పనీ చేయకుండా ఇంట్లోనే ఉంటున్నారు.
తినడానికి కూడా కష్టంగా మారడంతో.. కుటుంబ పోషణ కోసం ఆ బాలుడే గ్రామంలో begging చేస్తున్నాడు. ఈ క్రమంలో వచ్చిన డబ్బుతోనే కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. రెండు రోజుల క్రితం అబ్బూకు భిక్షాటనలో డబ్బులు రాలేదు. దీంతో ఇంటికి ఏమీ తీసుకురాలేదు. డబ్బులు ఇవ్వలేదని తండ్రి ఎండీ ఇస్మాయిల్ కుమారుడిని ఇంట్లోనే బంధించాడు. ఆదివారం వేడినూనెను బాలుడు చేతులపై పోసాడు. దీంతో నొప్పి భరించలేక బాలుడు కేకలు పెట్టాడు. గమనించిన స్థానికులు బాలుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
చెట్టంత కొడుకును కొట్టి చంపి, ఇంటివెనుక పాతిపెట్టిన కన్నతల్లి..
ఇలాంటి దారుణ ఘటనే మధ్యప్రదేశ్ లోని జబల్‌పూర్‌లో జూన్ 15న వెలుగులోకి వచ్చింది. ఉద్యోగం చేస్తున్న ఓ తల్లిదండ్రులు తమ చిన్నారిని చూసుకోవడానికి కేర్ టేకర్ ను పెట్టుకున్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ.. ఆ చిన్నారిలో మార్పును వారు గమనించారు. ఎప్పుడు సందడిగా ఉండే ఆ చిన్నారి.. నిశ్శబ్దంగా మారిపోయాడు. అంతేకాదు నీరసంగా కూడా తయారయ్యాడు. దీంతో బాబుకు ఏమయ్యిందో అని తల్లిదండ్రులు చిన్నారిని వైద్యుల వద్దకు తీసుకెళ్లగా.. చిన్నారి అంతర్గత అవయవాలు వాచిపోయి ఉన్నాయని డాక్టర్ తెలిపాడు. అంతేకాదు చిన్నారిని చిత్రహింసలకు గురి చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశాడు.
దీంతో షాక్ కు గురైన చిన్నారి తల్లిదండ్రులు.. ఏం జరిగిందో అర్థంకాక ఇంట్లో.. బాబును చూసుకునే నానీకి తెలియకుండా.. సీసీ టీవీ కెమెరాలను అమర్చారు. సాయంత్రం వారు ఆఫీసులనుంచి ఇంటికి వచ్చాక.. అందులో రికార్డైన దృశ్యం వారిని ఉలిక్కిపడేలా చేసింది. రజినీ చౌదరిగా గుర్తించబడిన నానీని నెలవారీ రూ. 5,000 ఇచ్చి.. బాబును చూసుకోవడానికి నియమించుకున్నారు. జీతంతో పాటు ఆమెకు భోజనం కూడా పెడుతున్నారు. తల్లిదండ్రులు వెళ్లగానే ఆమె చిన్నారిని కొట్టడం.. జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లడం.. తిండి సరిగా పెట్టకపోవడం లాంటివి అందులో రికార్డయ్యాయి.
దీంతో వెంటనే వారు ఆమె మీద పోలీస్ కంప్టైంట్ ఇచ్చారు. తమ చిన్నారి ఆరోగ్యం పాడవ్వడం గురించి ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఆమె మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. రెండేళ్ల చిన్నారి మీద ఇంత దారుణానికి పాల్పడిన ఘటన నుంచి జబల్‌పూర్ తల్లిదండ్రులు ఇంకా తేరుకోలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో.. చిన్నారిని నానీ కొట్టడం, జుట్టు పట్టుకుని లాక్కెళ్లడం.. ఈడ్చి చెంపల మీద కొట్టడం, ఇష్టానుసారంగా బాదడం.. మొరటుగా వ్యవహరించడం కనిపిస్తుంది.
