Asianet News TeluguAsianet News Telugu

కుటుంబాన్ని పట్టించుకోని తండ్రిని మందలించాడని.. కొడుకు అన్నంలో విషం కలిపి...

కుటుంబాన్ని పట్టించుకోకుండా తిరుగుతున్న తండ్రి..ఉన్న పొలాన్ని కూడా అమ్ముదామనడంతో ప్రశ్నించిన కొడుకును.. అన్నంలో విషం కలిపి చంపే ప్రయత్నం చేశాడు. 
 

father murder attempt on son over he quistioned him in vikarabad
Author
First Published Sep 28, 2022, 1:58 PM IST

వికారాబాద్ : కుటుంబాన్ని పట్టించుకోకుండా తిరుగుతున్న తండ్రిని ప్రశ్నించినందుకు కొడుకునే హత్య చేసేందుకు ప్రయత్నించాడు ఆ కసాయి. ఈ ఘటన వికారాబాద్ జిల్లా, మోమిన్పేట మండల పరిధిలో గల ఎన్కతల గ్రామంలో చోటు చేసుకుంది. ఎన్కతలకు చెందిన ఉప్పరి పెంటయ్య, గోవిందమ్మలు దంపతులు. వారికి వెంకటేశం, కృష్ణ ఇద్దరు కుమారులు. పెంటయ్య ఎద్దులు, మేకల వ్యాపారం చేస్తాడు. అయితే, కుటుంబాన్నిపట్టించుకోకుండా తిరుగుతుండేవాడు.

భార్య గోవిందమ్మే కుమారులిద్దరి బాగోగులూ చూసుకుంటోంది. తమకు ఉన్న ఐదు ఎకరాల భూమిని సాగు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుంది. ఇటీవల భూముల ధరలు విపరీతంగా పెరగడంతో.. భూమిని అమ్ముదామని ఇంట్లో పెంటయ్య గొడవ పడుతూ ఉండేవాడు. అవసరం లేనప్పుడు భూమిని అమ్మడం దేనికని కుమారులిద్దరూ అడ్డుపడుతున్నారు. ఈ నెల 24న ఉదయం పెద్ద కుమారుడు వెంకటేశం భోజనం చేసే సమయంలో అన్నంలో తండ్రి విషం కలిపాడు.

అది తెలుసుకోకుండా భోజనం చేసిన వెంకటేశం అస్వస్థతకు గురయ్యాడు. ఉన్నట్టుంది ఇలా జరగడంతో తల్లికి ఏమీ అర్థం కాలేదు. అయినా, వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లింది. పరీక్షలు నిర్వహించిన వైద్యులు అన్నంలో విషం కలిపారని తెలపడంతో తల్లి గోవిందమ్మ.. తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.  వెంకటేశం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విజయప్రకాష్ తెలిపారు.

అమీన్‌పూర్ లో వివాహితతో టీఆర్ఎస్ నేత రాసలీలలు: రికార్డు చేసిన వివాహిత భర్త, బెదిరింపులు

ఇదిలా ఉండగా, గుంటూరులో ఓ తల్లి కిరాతకానికి ఒడిగట్టింది. కన్న కొడుకునే కాళ్లు, చేతులు కట్టేసి, నోటికి ప్లాస్టర్ వేసి.. ఊపిరి ఆడకుండా తలకు పాలిథిన్ కవర్ చుట్టి.. ఆ తరువాత దిండుతో మొహంపై అదిమి హతమార్చింది. నిరుడు ఫిబ్రవరిలో గుంటూరులో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. నగరంపాలెం పోలీసుస్టేషన్‌ ఎస్‌హెచ్‌వో ఎ.మల్లికార్జునరావు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరులోని ఏటీ అగ్రహారం 8వ లైనులో నివాసముండే వల్లపు పోతురాజు, సుమలత దంపతులు. వీరికి ఇద్దరు సంతానం. కుమార్తె పుష్పాంబికకు పెళ్లి చేసి పంపించారు. కాగా కొడుకు సిద్ధార్థ (17) సిమెంట్ పనులు చేస్తుంటాడు. 

తల్లి సుమలత మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ కార్మికురాలు. సిద్ధార్థకు చిన్నప్పటి నుంచే చెడు స్నేహాలతో దురలవాట్లకు లోనయ్యాడు. పదేళ్ల క్రితం తండ్రి పోతురాజు మరణించాడు. సిద్ధార్థ నిత్యం మద్యం, గంజాయి, సొల్యూషన్‌ తాగి వచ్చి ఆ మత్తులో ఇంకా డబ్బులు కావాలంటూ తల్లి సుమలతను వేధింపులకు గురి చేస్తుండేవాడు. డబ్బులు ఇవ్వకుంటూ.. ఇంటిమీద రాళ్లు వేయడం, తల్లిని చిత్ర హింసలకు గురి చేయడంతో పాటు.. తల్లిని కొడుతుండేవాడని పోలీసులు తెలిపారు. దీనికి తోడు లాలాపేట పోలీసుస్టేషన్‌ పరిధిలోని ఏటుకూరు రోడ్డులో ఒక చిన్నారి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులోనూ సిద్ధార్థ నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో సుమారు 14 నెలల పాటు విజయవాడ జైలులో ఉండి వచ్చాడు. 

ఇదే క్రమంలో ఆ రాత్రి ఇంట్లోనుంచి వెళ్లి తెల్లవారుజామున 4గంటలకు ఇంటికి వచ్చాడు. అప్పటికే చాలా దొంగతనాలు చేసిన సిద్ధార్థను ఎక్కడికి పోయి వచ్చావని తల్లి ప్రశ్నించింది. దీంతో ఆమెను నానా రకాలుగా దుర్బాషలాడాడు. ఈ నేపథ్యంలో ఆమె విసిగిపోయింది. తెల్లారి మధ్యాహ్నం ఫూటుగా మద్యం తాగి వచ్చి నిద్రిస్తున్న కొడుకును కాళ్లు, చేతులు కట్టేసింది.. అరవకుండా నోటికి ప్లాస్టర్ వేసింది. ఊపిరి ఆడకుండా తలకు ప్లాస్టిక్ కవర్ చుట్టింది. ఆ తరువాత దిండుతో అదిమి చంపేసింది. ఆ తరువాత సుమలత నేరుగా నగరంపాలెం పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోయింది. 

Follow Us:
Download App:
  • android
  • ios