మద్యానికి బానిసగా మారిన కొడుకును  హత్య చేశాడు తండ్రి.ఈ ఘటన  కొత్తగూడెంలో చోటు  చేసుకుంది. కొడుకును హత్య చేసిన తర్వాత  రాజయ్య పోలీసులకు లొంగిపోయారు.

భద్రాచలం: మద్యానికి బానిసగా మారిన కొడుకు ప్రతి రోజూ వేధింపులకు పాల్పడుతుండడంతో తండ్రే కొడుకును హత్య చేశాడు. సోమవారంనాడు ఇంట్లో నిద్రపోతున్న కొడుకు శంకర్ ను తండ్రి రాజయ్య గొడ్డలితో నరికి చంపాడు. కొడుకును చంపిన తర్వాత రాజయ్య భద్రాచలం పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. రాజయ్య ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు.

డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఏ పని చేయకపోవడంతో పాటు మద్యానికి బానిసగా మారి ప్రతి రోజూ డబ్బుల కోసం వేధింపులకు పాల్పడుతుండడాన్ని భరించలేక హత్య చేసినట్టుగా రాజయ్య పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారని సమాచారం. ఈ ఘటన పాత భద్రాచలంలో కలకలం రేపింది. ఈ విషయం తెలిసిన వెంటనే స్థానికులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.