హైదరాబాద్ చందానగర్‌లో కన్న తండ్రే ఐదేళ్ల కూతురిని కిరాతకంగా చంపాడు. స్కూల్‌లో వున్న తన పాప మోక్షితను మాయమాటలు చెప్పి తీసుకెళ్లిన చంద్రశేఖర్ పెన్సిల్ బ్లేడ్‌తో గొంతుకోశాడు. 

హైదరాబాద్ చందానగర్‌లో దారుణం జరిగింది. కన్న తండ్రే ఐదేళ్ల కూతురిని కిరాతకంగా చంపాడు. స్కూల్‌లో వున్న తన పాప మోక్షితను మాయమాటలు చెప్పి తీసుకెళ్లిన చంద్రశేఖర్ పెన్సిల్ బ్లేడ్‌తో గొంతుకోశాడు. అంతేకాకుండా పాప మృతిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఓఆర్ఆర్‌లో కారుకు ప్రమాదం కావడంతో ఈ హత్యోదంతం వెలుగుచూసింది. కొన్నాళ్లుగా చంద్రశేఖర్ భార్యతో విడిగా వుంటున్నట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.