భార్యాభర్తలు తమ మధ్య ఎన్ని మనస్పర్థలు వచ్చినా వాటిని పిల్లలపై పడనీయరు.. కానీ ఈ తండ్రి మాత్రం భార్యపై కోపాన్ని తన బిడ్డపై చూపించాడు.. హైదరాబాద్ జగద్గరిగుట్టలో నివసిస్తున్న భార్యాభర్తల మధ్య ఏదో విషయంపై గొడవ జరిగింది. ఆ సమయంలో ఆగ్రహంతో ఊగిపోయిన అతను.. ఇంట్లో పడుకుని ఉన్న నెలల చిన్నారిని బయటకు తీసుకువచ్చి... అక్కడే ఉన్న ఆటోపై విసిరివేశాడు..

గొడవ చూసి కుటుంబసభ్యులు, స్థానికులు పరుగుపరుగున వచ్చి అతన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ వినిపించుకోకుండా.. బాబును మరోసారి నేలకేసికొట్టాడు. ఈ ఘటనలో చిన్నారి ఆపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. స్థానికులు బాబుని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు. కాగా.. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.