నిర్మల్: కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కన్న కూతురిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది. మద్యం మత్తులో విచక్షణను కోల్పోయిన తండ్రి ఇంట్లో ఒంటరిగా వున్న కూతురిపైనే అత్యంత దారుణంగా హత్యాచారానికి పాల్పడ్డాడు. కూతురిపై జరిగిన అఘాయిత్యం గురించి తెలుసుకున్న తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మానవ సంబంధాలకు మచ్చలాంటి ఈ దారుణం గురించి బయటపడింది. 

ఈ అమానవీయ సంఘటన గురించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నిర్మల్‌ జిల్లా సోన్‌ మండలం గాంధీ నగర్‌ గ్రామానికి చెందిన దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు. భర్త కుటుంబాన్ని పట్టించుకోకుండా తాగుడుకు బానిస కావడంతో భార్య కూలీపనులకు వెళ్లేది. ఇలా గత శనివారం ఉదయం కూడా కూలీ పనులకు వెళ్లింది. 

అయితే ఇదే సమయంలో ఫూటుగా మద్యంతాగి ఇంటికి వచ్చిన తండ్రి ఆరేళ్ల కూతురు ఒంటరిగా వుండటాన్ని గుర్తించాడు. కామంతో కళ్లు మూసుకుపోయిన అతడు అభం శుభం తెలియని ఆ చిన్నారిపై అతి కిరాతకంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. తండ్రి మృగంలా మారి అత్యాచారానికి పాల్పడటంతో బాలికకు తీవ్ర రక్తస్రావం అయ్యింది. 

సాయంత్రం కూలీ పని ముగించుకుని ఇంటికి వచ్చిన తల్లికి చిన్నారి తీవ్ర రక్తస్రావంతో కనిపించింది. దీంతో ఏం జరిగిందో తల్లి ఆరా తీయగా తండ్రే తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని చెప్పింది. దీంతో ఆ తల్లి కూతురిని వైద్యం కోసం హాస్పిటల్ కు తరలించింది. అప్పటికే ఈ విషయం గ్రామస్తులకు తెలియడంతో ఇంటికి వచ్చిన ఆ తండ్రిని చితకబాది పోలీసులకు అప్పగించారు.బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.