Asianet News TeluguAsianet News Telugu

పండగ పూట వరంగల్ జిల్లాలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో తండ్రీకూతురు మృతి..

దసరా పండగ వేళ వరంగల్ జిల్లాలో రాయపర్తి మండలంలో విషాదం చోటుచేసుకుంది.

Father daughter die in  Road accident in warangal ksm
Author
First Published Oct 22, 2023, 1:22 PM IST | Last Updated Oct 22, 2023, 1:22 PM IST

దసరా పండగ వేళ వరంగల్ జిల్లాలో రాయపర్తి మండలంలో విషాదం చోటుచేసుకుంది. పండగ కోసమని కూతరు-అల్లుడిని ఇంటికి తీసుకొచ్చి సరదాగా గడుపుదామని అనుకున్న కుటుంబంలో రోడ్డు ప్రమాదం విషాదం నింపింది. వివరాలు.. వరంగల్‌ జిల్లా రాయపర్తి మండలం మొరిపిరాలకు చెందిన వెంకన్న కూతురు అనూష, అల్లుడు రాజేశ్‌ హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. దసరా పండగ వేళ కూతురు-అల్లుడును మొరిపిరాలలోని తన నివాసానికి తీసుకొచ్చేందుకు వెంకన్న హైదరాబాద్‌కు వెళ్లాడు. 

అయితే కూతురు అల్లుడుని హైదరాబాద్ నుంచి మెరిపిరాలకు తీసుకొస్తున్న సమయంలో.. రాయపర్తి మండలం కిష్టాపురం సమీపానికి రాగానే వాళ్లు ప్రయాణిస్తున్న బైక్‌ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకన్న, అనూష అక్కడికక్కడే మృతి చెందారు. రాజేశ్‌ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే రాజేష్‌ను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారంఅందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదం తర్వాత కారు డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. అతడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.  
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios