సిద్ధిపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన ఇద్దరు కుమార్తెలకు ఉరివేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు
సిద్ధిపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన ఇద్దరు కుమార్తెలకు ఉరివేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. దుబ్బాక మండలం లచ్చపేటకు చెందిన బడుగు రాజేందర్ అనే వ్యక్తి భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి నివసిస్తున్నాడు.
ఈ క్రమంలో ఏడాది క్రితం అతని భార్య మరణించింది. దీంతో కూతుళ్లు భవాని, లక్షీతో కలిసి ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి తన ఇద్దరు కుమార్తెలకు ఉరేసి , అనంతరం తాను కూడా ఉరి వేసుకున్నాడు.
స్ధానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆర్ధిక ఇబ్బందుల కారణంగానే ఘటన జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Apr 26, 2019, 8:48 AM IST