ప్రియుడితో కలిసున్న కూతురిని రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్న తండ్రి (వీడియో)

https://static.asianetnews.com/images/authors/3800b66b-dc46-549b-a35e-91a1dbfb7895.jpg
First Published 27, Aug 2018, 2:44 PM IST
Father caught daughter Red handedly  with boyfriend
Highlights

తెలిసీ తెలియని వయసులో కలిగే ఆకర్షనను ప్రేమగా భావిస్తూ నేటి యువత విచ్చలవిడి తనానికి అలవాటుపడుతున్నారు. తల్లిదండ్రుల కల్లుగప్పి, చదువును పక్కనబెట్టి జల్సాలు చేసుకుంటూ కేరీర్ ను నాశనం చేసుకుంటున్న అనేక సంఘటనలు ఇటీవల కాలంలో జరుగుతున్నాయి.  తాజాగా వరంగల్ పట్టణంలో ఇలాంటి సంఘటనే బైటపడింది.

తెలిసీ తెలియని వయసులో కలిగే ఆకర్షనను ప్రేమగా భావిస్తూ నేటి యువత విచ్చలవిడి తనానికి అలవాటుపడుతున్నారు. తల్లిదండ్రుల కల్లుగప్పి, చదువును పక్కనబెట్టి జల్సాలు చేసుకుంటూ కేరీర్ ను నాశనం చేసుకుంటున్న అనేక సంఘటనలు ఇటీవల కాలంలో జరుగుతున్నాయి.  తాజాగా వరంగల్ పట్టణంలో ఇలాంటి సంఘటనే బైటపడింది.చదువు పేరుతో బైటికి వెళ్లిన కూతురు ప్రియుడితో తిరుగుతుండగా తండ్రి రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నాడు.

వివరాల్లోకి వెళితే....వరంగల్ పట్టణంలోని ఎస్2 థియేటర్ కు ఓ ప్రేమ జంట సినిమమాకు వెళ్లారు. అయితే అదే సినిమాకు సదరు యువతి తండ్రి కూడా వచ్చాడు. సినిమా హాల్లో తన కూతురు వేరే యువకుడితో ఉండడాన్ని గమనించిన ఆ తండ్రి ఆవేశంతో ఊగిపోయాడు. వారిద్దరి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని సినిమా హాల్లోంచి బైటికి లాక్కొచ్చాడు.  అనంతరం ఆ యువకుడితో పాటు కూతురిని అందరూ చూస్తుండగానే చితకబాదాడు.  

చదువుకొమ్మని కాలేజీకి పంపింస్తే నువ్వు చేసే పని ఇదా? అంటూ కూతురిని ప్రశ్నిస్తూ చితకబాదాడు. అంతే కాదు ఆ యువకుడికి కూడా నాలుగు తగిలించారు. ఆవేశంతో ఊగిపోతున్న ఆ వ్యక్తిని  అక్కడున్న ప్రేక్షకులు సముదాయించారు. దీంతో కాస్త శాంతించిన అతడు తన కూతురిని తీసుకుని అక్కడినుండి వెళ్లిపోయాడు. 

వీడియో

"

 

loader