జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం జరిగింది. పొలం విషయంలో గొడవల కారణంగా ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, ఇద్దరు కుమారులను ప్రత్యర్థులు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. కాటారం మండలం గంగారం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం జరిగింది. పొలం విషయంలో గొడవల కారణంగా ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, ఇద్దరు కుమారులను ప్రత్యర్థులు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. కాటారం మండలం గంగారం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పొలం విషయంలో గత కొంతకాలంగా రెండు కుటుంబాల మధ్య వివాదం వుంది. దీనికి సంబంధించి మరోసారి మాట్లాడుకునేందుకు శనివారం పొలం వద్ద రెండు కుటుంబాలు సమావేశమయ్యారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ సమయంలో మాటామాటా పెరగి గొడవ తారా స్థాయికి చేరడంతో మంజూ నాయక్, ఆయన కుమారులు సారయ్య, భాస్కర్‌లను ప్రత్యర్ధులు గొడ్డలితో నరికి హత్య చేశారు. తీవ్ర గాయాలపాలైన వీరు ముగ్గురు ఘటనాస్థలంలోనే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నిందితులు పరారీలో వున్నారు. వీరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.