దైవదర్శనానికి వెళ్లివస్తున్న ఓ కుటుంబాన్ని విషాదం వెంటాడింది. రోడ్డు ప్రమాదంలో తండ్రీ కొడుకు మృత్యువాత పడ్డారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం తిమ్మాపూర్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వీరిద్దరూ మరణించారు. 

ఆయిల్ ట్యాంకర్ ను కారు ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తండ్రీ కొడుకు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ లోని బ్యాంకర్స్ కాలనీ వాసులు దైవ దర్శనానికి తిరుమల వెళ్లి వస్తున్నారు. 

తిరిగి వస్తుండగా ఈ తెల్లవారుజామున తిమ్మాపూర్ వద్దకు రాగానే ఆయిల్ ట్యాంకర్ ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న సత్యనారాయణ చక్రవర్తి, అతని కుమారుడు కల్యాణ చక్రవర్తి అక్కడిక్కడే మృతి చెందారు. కారులో ఉన్న మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.