భార్య మరోకరితో వివాహేతర సంబంధం పెట్టుకుని వెళ్లిపోవడంతో ఇద్దరు బిడ్డలకు ఉరి వేసి, తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడో వ్యక్తి .

వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర సరిహద్దుల్లోని బల్లార్‌పూర్‌కు చెందిన రుషికాంత్ ఐటీఐ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య ఇద్దరు బిడ్డలు ఉన్నారు. ఈ క్రమంలో భార్యకు వేరొకరితో అక్రమ సంబంధం ఏర్పడింది. వారం రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయింది.

దీంతో అతను తీవ్ర మానసిక వేధనకు గురయ్యాడు. ఆమెను తిరిగి ఇంటికి తీసుకొచ్చేందుకు ఎంతగానో ప్రయత్నించాడు, చివరికి పోలీస్ స్టేషన్‌లోనూ ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

తనతో పాటు తన ఇద్దరు కుమార్తెల గురించి ఆలోచించిన రుషికాంత్ .. వారిని కూడా కడతేర్చాలని భావించాడు. ముందుగా కుమార్తెలకు చున్నీతో ఉరి వేసి, ఆ ఫోటోను వాట్సాప్ ద్వారా భార్యకు పంపాడు.

అనంతరం తాను ఉరి వేసుకుని చనిపోయాడు. ఈ క్రమంలో వాట్సాప్ చూసుకున్న భార్య వెంటనే బల్లార్‌పూర్ పోలీస్ స్టేషన్‌తో పాటు తన తల్లిదండ్రులకు సమాచారం అందించింది.

రు వెంటనే రుషికాంత్ ఇంటిపైన నివాసముండే సోదరుడికి ఫోన్‌లో చెప్పారు. అతడు వెంటనే వచ్చి చూశాడు. ఎంత పిలిచినా తలుపులు తెరుచుకోకపోవడంతో, పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పోలీసులు వచ్చి తలుపులు బద్దలు కొట్టి చూడగా.. లోపల తండ్రి, ఇద్దరు కుమార్తెల మృతదేహాలు వేలాడుతూ కనిపించాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.