చేవేళ్ల:రంగారెడ్డి జిల్లా చేవేళ్ల మండలానికి చెందిన ఇద్దరు రైతులు తమ పేరున రికార్డుల్లో భూమిని చేర్చాలని కోరుతూ తహసీల్దార్ కాళ్లు పట్టుకొని ప్రాధేయపడ్డారు. అయినా కూడ ఆ తహసీల్దార్ మాత్రం కనికరించలేదు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

రంగారెడ్డి చేవేళ్ల మండలం ఆలూరు, మిర్జాగూడకు చెందిన లింగయ్య, సత్తయ్య, మల్లయ్య అనే రైతులు తమ పేరున ఉన్న భూమి రికార్డుల్లో మాత్రం తక్కువగా ఉండడాన్ని గుర్తించారు. పాస్ పుస్తకాల్లో రికార్డులను సరిచేయాలని చేవేళ్ల తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. కానీ, రికార్డులు మాత్రం సరిచేయలేదు.

కలెక్టర్ ఆదేశాలను కూడ రెవిన్యూ అధికారులు పట్టించుకోలేదు. తమ రికార్డులు సరి చేయాలని కోరుతూ  తహసీల్దార్ పురుషోత్తం కాళ్ల మీద పడి రైతులు వేడుకొన్నారు. అయినా కూడ తహసీల్దార్ పురుషోత్తంలో చలనం లేదు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.