నాగర్ కర్నూల్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.  రైతులు ముకుమ్మడిగా ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించారు. కలెక్టరేట్ భవనం పైకి ఆత్మహత్యకు యత్నించారు. వారంతా పెంట్లవెల్లి మండలం జట్టుప్రోలు రైతులుగా పోలీసులు గుర్తించారు.

Also Read మంత్రి పువ్వాడ అజయ్ కు తృటిలో తప్పిన ప్రమాదం...

చేతిలో కిరోసిన్ డబ్బాలు పట్టుకొని వచ్చి మరీ కలెక్టరేట్ భవనంపైకి ఎక్కారు. తమ భూమిని కొందరు కబ్జా చేస్తూ.. పైగా తమనే బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ.. వారు ఈ దారుణానికి ప్రయత్నించడం గమనార్హం. ఈ విషయమై ఇప్పటికే తాము చాలా సార్లు అధికారులకు ఫిర్యాదు చేశామని వాళ్లు పట్టించుకోలేదని వారు వాపోయారు. దాదాపు 12మంది రైతులు బలవన్మరణానికి పాల్పడేందుకు సిద్ధపడ్డారు. కాగా.. పోలీసులు వచ్చి వారి ప్రయత్నాన్ని విరమింపచేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.