జనగామ జిల్లా కలెక్టరేట్ వద్ద శుక్రవారం ఉద్రిక్తత నెలకొంది. చేతికొచ్చిన కంది పంటను తొలిగించి తమ భూమిని కబ్జా చేశారని రైతులు ఆందోళనకు దిగారు. లింగాల ఘన్‌పూర్ మండలం నెళ్లుట్ల గ్రామానికి చెందిన రైతులు పురుగు మందుల డబ్బాలతో ధర్నాకు దిగారు.

తమకు న్యాయం చేయాలంటూ కలెక్టరేట్ ముందు నినాదాలు చేశారు రైతులు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు .. పురుగు మందుల డబ్బులను స్వాధీనం చేసుకున్నారు. వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.