Asianet News TeluguAsianet News Telugu

జూరాల ప్రాజెక్టు వద్ద రైతుల ధర్నా

 ఆయకట్టు చివరి భూములకు నీరిస్తే రబీకి నీరివ్వడానికి ప్రాజెక్టులో నీరుండదని గద్వాల ప్రాంత రైతులు  ఆందోళనకు దిగారు.

farmers potest at jurala project in gadwala district
Author
Gadwal, First Published Jan 6, 2019, 1:10 PM IST


గద్వాల: ఆయకట్టు చివరి భూములకు నీరిస్తే రబీకి నీరివ్వడానికి ప్రాజెక్టులో నీరుండదని గద్వాల ప్రాంత రైతులు  ఆందోళనకు దిగారు. పోలీసుల సహాయంతో అధికారులు ఆయకట్టు చివరి భూములకు నీటిని విడుదల చేశారు.

కొల్లాపూర్, వనపర్తి ప్రాంతాలకు జూరాల ప్రాజెక్టు నుండి రబీకి నీరివ్వకుండా ఆయకట్టు చివరి భూములకు నీరు విడుదల చేయడాన్ని  రైతులు అడ్డుకొన్నారు. కానీ, పోలీసుల సహాయంతో అధికారులు  నీటిని విడుదల చేశారు.

జూరాల ప్రాజెక్టులో నీరు అడుగంటిపోతోంది. రబీ సీజన్‌కు  నీరివ్వాలని ఆయకట్టు రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ తరుణంలోనే ఆయకట్టు చివరి భూముల రైతాంగానికి నీరివ్వాలని కూడ ఆ ప్రాంత రైతులు డిమాండ్ చేస్తున్నారు.

పంట నష్టపోకుండా చివరి దశలో నీరివ్వాలసి వనపర్తి, కొల్లాపూర్ రైతులు డిమాండ్‌తో కొంత ఉద్రిక్తత నెలకొంది. రబీకి నీరివ్వకుండా ప్రాజెక్టులో ఉన్న నీటిని విడుదల చేయడంతో నష్టపోతామని గద్వాల పరిసర ప్రాంత రైతులు  ఆందోళనగా ఉన్నారు.

కొల్లాపూర్, వనపర్తి ప్రాంతాలకు నీరు విడుదల చేయకుండా అడ్డుకొన్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి స్థానిక రైతులకు నచ్చచెప్పారు. అధికారుల తీరును నిరసిస్తూ రైతులు ధర్నాకు దిగారు. దీంతో పోలీసుల సహాయంతో  అధికారులు దిగువ ప్రాంత రైతాంగానికి నీటిని విడుదల చేశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios