Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ రైతాంగం సీఎం కేసీఆర్ వెంటే ఉంది.. బీఆర్ఎస్ దే గెలుపు.. : ఎమ్మెల్సీ కే. క‌విత

BRS MLC K Kavitha: తెలంగాణ రైతాంగం సీఎం కేసీఆర్ వెంటే ఉందనీ, రాష్ట్రంలో మ‌రోసారి భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) అధికారంలోకి వ‌స్తుంద‌ని ఆ పార్టీ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత అన్నారు. రైతుబంధు ద్వారా ఎకరాకు ఏడాదికి రూ.10 వేల నుంచి రూ.12 వేలకు పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.
 

Farmers across Telangana are with CM KCR: BRS leader K Kavitha RMA
Author
First Published Oct 17, 2023, 3:05 PM IST | Last Updated Oct 17, 2023, 3:05 PM IST

Telangana polls 2023: తెలంగాణ రైతాంగం సీఎం కేసీఆర్ వెంటే ఉందనీ, రాష్ట్రంలో మ‌రోసారి భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) అధికారంలోకి వ‌స్తుంద‌ని ఆ పార్టీ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత అన్నారు. రైతుబంధు ద్వారా ఎకరాకు ఏడాదికి రూ.10 వేల నుంచి రూ.12 వేలకు పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలోని రైతులు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు ఓటేస్తారనీ, ప్రభుత్వ ప్రాయోజిత 'రైతు బంధు' పథకం వారి జీవితాల్లో, జీవనంలో మార్పు తెచ్చిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. రైతులకు పంట ఇన్ పుట్ సబ్సిడీ అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధుకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు.

'రైతుబంధు' పథకం ద్వారా రైతులకు కలిగే ప్రయోజనాలను ఐక్యరాజ్యసమితి కూడా ప్రశంసించిందని గుర్తు చేశారు. ప్రస్తుతమున్న పథకాన్ని వచ్చే టర్మ్ లో మరింతగా ప్రమోట్ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. రైతుబంధు పథకాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి సంబంధించి అధికార పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు చారిత్రాత్మకమైనవనీ, రైతుబంధు ద్వారా ఎకరాకు ఏడాదికి రూ.10 వేల నుంచి రూ.12 వేలకు పెంచుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. క్రమంగా ఆ ప్రయోజనాలను ఎకరానికి రూ.16 వేలకు పెంచ‌డానికి ఇప్పుడు ఇచ్చిన హామీల‌ను గుర్తు చేశారు.

విప్లవాత్మకమైన 'రైతుబంధు' పథకంతో రైతుల జీవితాలను, తెలంగాణ వ్యవసాయ ముఖచిత్రాన్ని గణనీయంగా మార్చిన సీఎం కేసీఆర్ వెంట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారని అన్నారు. రైతుల ఆశీస్సులు, ప్రేమతో వచ్చే ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. 2018 ఫిబ్రవరి 25న జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన రైతు సమన్వయ సమితి (రైతు సమన్వయ సమితి) సమావేశంలో 'రైతుబంధు' పథకాన్ని తెలంగాణ సీఎం ప్రకటించారు. సాగుకు ఆర్థిక సాయం ఈ ప‌థ‌కం కింద అందిస్తున్నారు. 

కాగా, తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు, ఫ‌లితాలు వెలువ‌డుతాయి. అంత‌కుముందు, 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 119 స్థానాలకు గాను 88 స్థానాలను గెలుచుకుని, పోలైన మొత్తం ఓట్లలో 47.4 శాతం ఓట్లను సాధించి అధికారంలోకి వ‌చ్చింది. ప్ర‌స్తుతం దూకుడు మీదున్న కాంగ్రెస్ కేవలం 19 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది. అయితే, ఈ సారి ఎలాగైనా అధికార పీఠం ద‌క్కించుకోవాల‌ని చూస్తోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ ల మ‌ధ్య గ‌ట్టిపోటీ ఉంటుంద‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios