Asianet News TeluguAsianet News Telugu

కారణమిదీ: తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతు కుటుంబం ఆత్మహత్యాయత్నం

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని చింతకాని తహసీల్దార్ ఎమ్మార్వో కార్యాలయం వద్ద గురువారం నాడు ఉద్రిక్తత చోటు చేసుకొంది. తమ భూమిని వేరే వారికి రిజిస్ట్రేషన్ చేశారని బాధిత కుటుంబం  ఆందోళనకు దిగింది. పెట్రోల్ పోసుకొని ఆత్మాహత్యాయత్నం చేశారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకొంది.

farmer family tries to suicide attempt in Khammam distrcit lns
Author
Khammam, First Published Feb 25, 2021, 4:29 PM IST

ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని చింతకాని తహసీల్దార్ ఎమ్మార్వో కార్యాలయం వద్ద గురువారం నాడు ఉద్రిక్తత చోటు చేసుకొంది. తమ భూమిని వేరే వారికి రిజిస్ట్రేషన్ చేశారని బాధిత కుటుంబం  ఆందోళనకు దిగింది. పెట్రోల్ పోసుకొని ఆత్మాహత్యాయత్నం చేశారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకొంది.

తనకు తెలియకుండానే తమ సోదరీలు  తండ్రి నుండి వారసత్వంగా వచ్చిన పొలాన్ని తమ పేరున మార్పిడి చేసుకొన్నారని  ఓ రైతు కుటుంబం ఆరోపిస్తోంది. 

తన తండ్రికి మతిస్థిమితం లేకపోవడంతో  పాస్ పుస్తకాలను తన వద్ద ఉంచుకొన్నానని చెప్పారు. అయితే ఆధార్, పాస్ పుస్తకాల తన వద్దే ఉన్నప్పటికీ కూడ అధికారులను తప్పుదోవ పట్టించి తమ భూమిని వారి పేరున మార్పిడి చేసుకొన్నారని ఆయన ఆరోపించారు.

తమ భూమిని తమ పేరున మార్పిడి చేయాలని కోరుతూ బాధిత కుటుంబం చింతకాని తహసీల్దార్ కార్యాలయం ముందు గురువారం నాడు నిరసనకు దిగింది. న్యాయం చేయాలని కోరుతూ పెట్రోలు పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. అధికారులు వారికి నచ్చజెప్పారు. న్యాయం చేస్తామని హమీ ఇచ్చారు దీంతో వారు ఆందోళనను విరమించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios