Asianet News TeluguAsianet News Telugu

ధాన్యం అమ్మడానికి వచ్చి: వరికుప్పపై కుప్పకూలిన రైతు

కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ధాన్యం అమ్మేందుకు వచ్చిన రైతు ఎండదెబ్బకు వరికుప్పపైనే కుప్పకూలాడు.

farmer dies from sunstroke in kamareddy
Author
Kamareddy, First Published May 8, 2019, 11:09 AM IST

కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ధాన్యం అమ్మేందుకు వచ్చిన రైతు ఎండదెబ్బకు వరికుప్పపైనే కుప్పకూలాడు. యల్లారెడ్డి మండలం లక్ష్మాపూర్‌‌లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రానికి గోపాల్ అనే రైతు తన ధాన్యాన్ని విక్రయించేందుకు వచ్చాడు.

ఐదు రోజులుగా వరి కొనుగోలు కోసం అక్కడే పడిగాపులు కాస్తున్న అతను వరికుప్పపైనే పడుకున్నాడు. ఈ క్రమంలో ఎండ వేడిమి తట్టుకోలేక వడదెబ్బకు గురై అతను బుధవారం మరణించాడు.

దీంతో తోటి రైతులు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. వారు కూడా తమకు సంబంధం లేదని చేతులు దులుపుకుంటున్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయలేదని రైతులు మండిపడుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios