ఆర్థిక సమస్యలతో ఓ కుటుంబం ప్రాణాలు విడిచింది.  ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు విడిచారు. ఈ సంఘటన మిర్యాలగూడలో చోటుచేసుకుంది.  పూర్తి వివరాల్లోకి వెళితే... మిర్యాలగూడలోని సంతోష్ నగర్ కి చెందిన పారేపల్లి లోకేష్ గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమౌతున్నాడు.

ఈ క్రమంలో మంగళవారం కూల్ డ్రింక్ లో విషం కలుపుకొని లోకేష్ తాగాడు. అనంతరం విషం కలిపిన కూల్ డ్రింక్ ని అతని భార్య(40) , కుమారుడు లోహిత్(14)లతో కూడా తాగించాడు. దీంతో.. వారు మృతి చెందారు. ఆర్థిక సమస్యల కారణంగానే వారు ఈ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

ఆత్మహత్యాయత్నానికి ముందు లోకేష్‌ రాసిన సూసైడ్‌ నోట్‌ బయటపడింది. ‘క్షమించండి అమ్మానాన్నా. బ్రతికే అర్హత లేదు. నాన్నా దయచేసి ఈ చిన్న అప్పులు తీర్చండి’ అని లోకేష్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. జీవితంలో స్థిరపడకపోవడంతో తన తమ్ముడు ఎప్పుడూ ఆత్మన్యూనతా భావంతో ఉండేవాడని అతని సోదరుడు చెప్పాడు. ఆర్థిక ఇబ్బందులతోనే ఇంతటి ఘోరానికి పాల్పడ్డారని కన్నీరుమున్నీరయ్యాడు.