కుల పెద్దల అనాగరిక తీర్పుతో గత పదేళ్లుగా ఓ కుటుంబం కుల బహిష్కరణ అనుభవిస్తున్న ఘటన జగిత్యాల జిల్లాలో తాజాగా వెలుగుచూసింది. 

జగిత్యాల :ఈ టెక్నాలజీ యుగంలోనూ కొందరు కుల దురంహంకారంతో అతిగా ప్రవర్తిస్తున్న ఘటనలు అనేకం వెలుగుచూస్తున్నాయి. నిమ్న కులాలు, దళిత వర్గాలకు చెందినవారు గ్రామాల్లో పెద్ద మనుషులుగా చెలామనీ అయ్యేవారి పంచాయితీ తీర్పులతో ఇప్పటకీ అవమానాలను ఎదుర్కొంటున్నారు. జగిత్యాల జిల్లాలో ఇలాంటి సంఘటనే వెలుచూసింది. తమ కులానికే చెందిన ఓ కుటుంబాన్ని కులపెద్దలు బహిష్కరించారు. దీంతో గత పదేళ్లుగా ఆ కుటుంబంపై బహిష్కరణ కొనసాగుతుండగా తాజాగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 

 జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం జగదేవునిపేట గ్రామానికి చెందిన సింగిరెడ్డి దశరథ రెడ్డి సన్నకారు రైతు. పెద్దల నుండి వచ్చిన ఎకరం పొలంలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. అయితే భూమి హద్దుల విషయంలో పక్క భూమి యజమాని సింగిరెడ్డి రవీందర్ రెడ్డితో దశరథ రెడ్డికి గొడవ జరిగింది. ఇద్దరూ రెడ్డి సామాజికవర్గానికే చెందినవారు కావడంతో గ్రామంలోని కులపెద్దల వద్దకు పంచాయితీకి వెళ్ళారు. వారు సూచించినట్లుగా హద్దులు నిర్ణయించుకున్నారు. 

వీడియో

అయితే ఈ పంచాయితీ జరిగిన కొద్దిరోజులకే రవీందర్ రెడ్డి రెండు పొలాల మధ్యగల గట్టును తవ్వి ఆక్రమించుకోవడం ప్రారంభించాడని దశరథ రెడ్డి తెలిపాడు. దీంతో కుల పెద్దలను ఆశ్రయించగా వారు పట్టించుకోకపోవడంతో గ్రామ పంచాయితీలో ఫిర్యాదు చేసినట్లు తెలపాడు. తమను కాదని అధికారుల వద్దకు వెళ్లినందుకు తన కుటుంబాన్ని రెడ్డి కుల పెద్దలు బహిష్కరించారని వాపోయాడు. ఇలా గత పదేళ్లుగా తన కుటుంబంపై బహిష్కరణ కొనసాగుతోందని... తన ఇంటికి రెడ్డి కులస్తులు ఎవ్వరూ రారు... తన కుటుంబాన్ని ఏ ఇంట్లో శుభకార్యాలకు క పిలవరని దశరథ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసాడు. 

Video నకిలీ పురుగుమందుతో నష్టపోయిన రైతులు... 120 ఎకరాల్లో పంట నష్టం

గత పదేళ్లుగా సొంత కులానికి చెందినవారి నుండి తీవ్ర వేధింపులు ఎదుర్కొంటున్న దశరథరెడ్డి కుటుంబం ఇక వాటిని భరించలేక జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసారు. ఇవాళ జగిత్యాల కలెక్టరేట్ కు వెళ్లిన దశరథ రెడ్డి భార్య అరుణ ప్రజావాణిలో పాల్గొని తమ బాధను జిల్లా అధికారులకు తెలిపారు. కుల బహిష్కరణ చేసిన రెడ్డి కుల పెద్దలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. దీంతో వెల్గటూరు మండల అధికారులను ఈ వ్యవహారంపై విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులు ఆదేశించారు.