Hyderabad: తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలు చలిగాలులతో అల్లాడిపోతున్నాయి. తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు 13.7 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు చేరుకోగా, జంటనగరాల్లో అత్యల్ప ఉష్ణోగ్రత రాజేంద్రనగర్‌లో 11.9 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. 

Cold - Temperatures: దేశంలోని చాలా ప్రాంతాల్లో క్రమంగా ఉష్ణోగ్రలు తగ్గుముఖం పడుతున్నాయి. చలికాలంలో ప్రజలు పొద్దుపొద్దున్న ఇండ్ల నుంచి బయటకు రావడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతూ.. చలి తీవ్రత పెరుగుతోంది. రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో రానున్న నాలుగు రోజులపాటు చలిగాలుల హెచ్చరికలు జారీ అయ్యాయి. శీతాకాలం ప్రారంభమైంది.. గురువారం నుండి తీవ్రమైన గాలులతో నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలు కూడా ప్రభావితమయ్యాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే చలి చంపేస్తోంది. పొద్దుపొద్దున్న చాలా ప్రాంతాల్లో చలిమంటలు కనిపిస్తున్నాయి.

చలిగాలుల కారణంగా సీజనల్ వ్యాధులతో పాటు శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశాలున్నాయనీ, ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలు చలిగాలులతో అల్లాడిపోతున్నాయి. తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు 13.7 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు చేరుకోగా, జంటనగరాల్లో అత్యల్ప ఉష్ణోగ్రత రాజేంద్రనగర్‌లో 11.9 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత కామారెడ్డి జిల్లా రామలక్ష్మణపల్లెలో 9.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. కొమరం-భీం ఆసిఫాబాద్, సిద్దిపేట, రాజన్న-సిరిసిల్ల, మంచిర్యాలు, రంగారెడ్డి, నిజామాబాద్‌లో 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Scroll to load tweet…

మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో కూడా రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రాన్ని చలిగాలులు వణికిస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. పాడేరులో 12 డిగ్రీలు, మినుములూరులో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అరుకులోయలోనూ 11 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం నుంచి రాత్రి వరకు చలిగాలులు వీస్తూ చలిని తట్టుకునేందుకు ప్రజలు చలిమంటలు వేసుకుంటున్నారు. 

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ఉత్తర భారతం నుంచి తెలుగు రాష్ట్రాల వరకు పొడి గాలులు వీస్తున్నాయనీ వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. గురువారం, వంజాంగిల్ కొండల్లో అత్యల్ప ఉష్ణోగ్రత 7.1 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఆ తర్వాత అరకులోయలో 9.6 డిగ్రీల సెల్సియస్‌, జీకే వీధిలో 9 డిగ్రీల సెల్సియస్‌, ముంచింగ్‌పుట్‌లో 10 డిగ్రీల సెల్సియస్‌, చింతపల్లిలో 11 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ వెదర్‌మెన్ ప్రకారం, రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు చలికాలం ఉంటుంది. విజయవాడ, రాయలసీమ, గోదావరిలో చలిగాలులు పెరిగే అవకాశం ఉందన్నారు. "వైజాగ్, సమీప తీర ప్రాంతాలలో చల్లని రాత్రులతో వెచ్చని వాతావరణం ఉంటుంది. ఏజెన్సీ ప్రాంతాలు 6-10 డిగ్రీల సెల్సియస్‌తో వణుకుతున్నాయి" అని ట్వీట్ చేశారు.