Asianet News TeluguAsianet News Telugu

నకిలీ ఐపీఎస్ : పెళ్లి పేరుతో రూ. 11 కోట్లకు టోకరా.. యువకుడి ఆత్మహత్య...

ఐపీఎస్ అధికారిని అని చెప్పి.. తన చెల్లితో పెళ్లి చేయిస్తానని చెప్పి ఓ వ్యక్తి నుంచి రూ. 11 కోట్లు వసూలు చేసిన ఓ యువతిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆ వ్యక్తి నుంచి ఆమె తీసుకున్న ఖరీధైన కార్లు, కోట్ల విలువైన ఆస్తుల వివరాలు తెలిసి పోలీసులే షాకయ్యారు. 

fake ips officer arrested in bachupally, hyderabad - bsb
Author
Hyderabad, First Published Feb 24, 2021, 4:44 PM IST

ఐపీఎస్ అధికారిని అని చెప్పి.. తన చెల్లితో పెళ్లి చేయిస్తానని చెప్పి ఓ వ్యక్తి నుంచి రూ. 11 కోట్లు వసూలు చేసిన ఓ యువతిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆ వ్యక్తి నుంచి ఆమె తీసుకున్న ఖరీధైన కార్లు, కోట్ల విలువైన ఆస్తుల వివరాలు తెలిసి పోలీసులే షాకయ్యారు. 

ఆమె ఈ మోసాలు తన బంధువుతో కలిసి చేసింది. ఆమెను ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. శృతిసిన్హా అనే యువతి ఐపీఎస్ అధికారిణిగా చలామణీ అవుతోంది. ఈ క్రమంలో వీరారెడ్డి అనే వ్యక్తిని కలిసింది. అతడి సోదరుడికి తన చెల్లిని ఇచ్చి వివాహం చేస్తానని శృతిసిన్హా నమ్మించింది. ఈ క్రమంలో అతడి వద్దనుంచి రూ.11 కోట్ల వరకు వసూలు చేసింది. ఆమె తన బంధువు విజయ్ కుమార్ రెడ్డితో కలిసి మోసానికి పాల్పడింది. 

అయితే నెలరోజుల కిందట విజయ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ లో ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో వ్యవహారం బయటకు పొక్కింది. వీరారెడ్డితో వసూలు చేసిన  డబ్బుతో ఖరీదైన కార్లను శృతి కొనుగోలు చేసింది. ఈ విషయం తెలుసుకున్న బాపుపల్లి పోలీసులు శృతిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. 

నిందితురాలి నుంచి 3 కార్లు, రూ. 6 కోట్ల విలువైన ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆమె బారినపడి మోసానికి గురయిన వాళ్లు చాలామంది ఉన్నారని తెలుస్తోంది. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios