Fake Doctor Arrested: హైదరాబాద్ నగరంలో డాక్టర్ గా చలామనీ అవుతున్న నకిలీ వైద్యుడిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఎండీ ఫిజియోగా పని చేస్తున్న ఆయన రష్యా యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్ చేసినట్టు నకిలీ సర్టిఫికేట్ తెచ్చుకొని విధులు నిర్వర్తిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.
Fake Doctor Arrested: హైదరాబాద్ నగరంలో డాక్టర్‌గా చలామణి అవుతున్న నకిలీ డాక్టర్ ను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆ నకిలీ డాక్టర్ ఎండీ ఫిజియోగా పని చేస్తున్నాడు. Fake డాక్టర్ రష్యా యూనివర్సిటీ నుంచి నకిలీ ఎంబీబీఎస్ సర్టిఫికేట్ తెచ్చుకున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. ఈ క్రమంలో ఫేక్ డాక్టర్ పై పోలీసులు దాడులు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆ నకిలీ డాక్టర్‌తో పాటు అతనికి సహకరించిన మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ సమయంలో ఫేక్ ఎంబీబీఎస్ డాక్టర్ సర్టిఫికెట్‌తో పాటు ఇతర స్టాంపులు, ఓ కారు, బైక్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ప్రధాన నిందితుడు కుడిలేటి విజయ్ కుమార్ సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌కు చెందినవాడు. 2014లో ఆచార్య నాగర్జున విశ్వవిద్యాలయం నుండి దూరవిద్య ద్వారా B.Sc లో డిగ్రీ పూర్తి చేసాడు. ఆ తరువాత కొంత కాలం పలు ఆసుపత్రులలో కాంపౌండర్/ PRO గా పనిచేశాడు. వైద్యరంగంలోనే సిర్థ పడాలని, ఎలాగైనా నకిలీ ఎంబీబీఎస్ సర్టిఫికెట్లు సంపాదించాలని భావించాడు.
రెండేళ్ల క్రితం దిల్‌సుఖ్‌నగర్‌లోని సిగ్మా హాస్పిటల్‌లో పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నప్పుడు అఫ్రోజ్‌ఖాన్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో నకిలీ ఎంబీబీఎస్ సర్టిఫికెట్లు ఇప్పించాలని కోరాడు. ఈ క్రమంలో అఫ్రోజ్ తన స్నేహితుడు మహబూబ్ అలీ జునైద్‌ను పరిచయం చేశాడు. విజయ్ కుమార్‌కు ఎంబీబీఎస్ సర్టిఫికెట్ అవసరమని తెలియజేశాడు. నకిలీ MBBS సర్టిఫికేట్ అందించినందుకు 8 లక్షలు కావాలి అఫ్రోజ్‌తెలిపారు. ఫైనల్ గా రూ. 6,50,000/- చెల్లించి, రష్యాలోని కజాన్ స్టేట్ మెడికల్ యూనివర్శిటీ నుండి నకిలీ MBBS & ఇతర సర్టిఫికేట్లను పొందాడు.
నకిలీ సర్టిఫికేట్‌ను ఉపయోగించి విజయ్ కుమార్ COVID-19 కాలంలో 6 నెలల పాటు ఉప్పల్‌లోని లైఫ్ కేర్ హాస్పిటల్‌లో మెడికల్ ఆఫీసర్‌గా పని చేసి.. నెలకు రూ.60,000/- జీతం పొందారు. అనంతరం పని మానేశాడు. గత 6 నెలల కిత్రం మంద మల్లమ్మ ఎక్స్ రోడ్స్ సమీపంలోని ఆర్కే హాస్పిటల్‌లో డ్యూటీ మెడికల్ ఆఫీసర్‌గా, (ఎండీ) ఫిజీషియన్‌గా పని చేస్తూ అమాయక రోగులకు వైద్యం అందిస్తున్నారు. ఈ క్రమంలో విజయ్ కూమార్ పై పోలీసులకు ఫిర్యాదు అందడంతో రంగంలో దిగారు. గత కొద్ది రోజుల పాటు నిఘా పెట్టి.. గురువారం సాయంత్రం అతని ఆస్పత్రిపై రాచకొండ పోలీసులు సోదాలు నిర్వహించారు.