హైద్రాబాద్ లో నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టు రట్టు: నలుగురు అరెస్ట్

విదేశాలకు విద్యార్ధులను పంపేందుకు అవసరమైన నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ఓ కన్సల్టెన్సీ సంస్థకు చెందిన  లక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ముగ్గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. 
 

Fake certificates gang  Arrested in Telangana

హైదరాబాద్: Hyderabad నగరంలోని చైతన్యపురిలో  ఓ కన్సల్టెన్సీ సంస్థ   నకిలీ సర్టిపికెట్లు తయారు చేస్తుందని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఈ సంస్థపై దాడి చేసి  మంగళవారం నాడు  నలుగురిని Police లు అరెస్ట్ చేశారు. పలు యూనివర్శిటీలకు చెందిన నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్నందున అరెస్ట్ చేశారు.. విదేశాలకు విద్యార్ధులను పంపేందుకు గాను నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్నారని పోలీసులకు కచ్చితమైన సమాచారం ఆధారంగా పోలీసులు  అరెస్ట్ చేశారు.

ఈ కేసులో  రోహిత్ కుమార్, శ్రీనివాసరావు, సీఏ విద్యార్ధి సాయి ప్రణీత్ సహా మరొకరిని  పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతర రాష్ట్రాలకు చెందిన నకిలీ సర్టిఫికెట్లను పోలీసులు సీజ్ చేశారు. విదేశాలకు విద్యార్ధులకు పంపేందుకు అవసరమైన సర్టిఫికెట్లను ఈ కన్సల్టెన్సీ తయారు చేస్తుందని పోలీసులు గుర్తించారు. కాకతీయ, జేఎన్‌టీయూ, నాగార్జున యూనివర్శిటీలకు చెందిన సర్టిఫికెట్లు తయారు చేస్తున్నారని రాచకొండ పోలీసులు తెలిపారు. ఒక్కో సర్టిఫిెట్ కు రూ. 30 నుండి రూ. 40 వేలు వసూలు చేస్తున్నారని పోలీసులు చెప్పారు. విదేశాలకు వెళ్లేవారు ఈ సర్టిపికెట్లు తీసుకుంటున్నారని రాచకొండ సీపీ మహేష్ భగవత్ చెప్పారు. 

గతంలో కూడా నకిలీ సర్టిపికెట్లు ముఠాను హైద్రాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. విదేశాలకు విద్యార్ధులను పంపే ఓ కన్సల్టెన్సీ సంస్థ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ యూనివర్శిటీతో సంబంధాలు ఏర్పాటు చేసి నకిలీ సర్టిపికెట్లు తయారు చేసింది. మధ్యప్రదేశ్  రాష్ట్రంలోని సర్వేపల్లి రాధాకృష్ణన్ యూనివర్శిటీ నుండి హైద్రాబాద్ కు పెద్ద ఎత్తున నకిలీ సర్టిఫికెట్లు వచ్చిన విషయాన్ని పోలీసులు గుర్తించారు. ఈ ఏడాది మే 15న ఈ యూనివర్శిటీకి చెందిన మాజీ వీసీలు ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే కేసులో మరో ఏడుగురిని కూడా పోలీసులు గతంలోనే అరెస్ట్ చేశారు. నిందితులు ఉపయోగించిన మొబైల్స్, కంప్యూటర్లను కూడా పోలీసులు సీజ్ చేశారు.

హైద్రాబాద్ చాదర్ ఘాట్ సమీపంలో వీఎస్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ పేరుతో కన్సల్టెన్సీని పీకే వీరన్నస్వామి ఏర్పాటు చేశాడు. అయితే నకిలీ సర్టిఫికెట్లతో మంచి ఆదాయం వస్తుందని గుర్తించిన వీరన్సస్వామి నకిలీ సర్టిపికెట్ల దందా వైపు కేంద్రీకరించారు.

.డ్రాప్‌ఔట్స్, బ్యాక్‌లాగ్స్‌ ఉన్న వాళ్లతో పాటు ఫెయిల్‌ అయిన విద్యార్థుల వివరాలను కాలేజీల నుంచి సేకరిస్తున్నాడు. ఆ విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను సంప్రదిస్తున్న వీరన్న స్వామి ఎలాంటి అడ్మిషన్లు, పరీక్షలు లేకుండా సర్టిఫికెట్లు ఇస్తానని ఒప్పందాలు చేసుకొనేవాడు. నకిలీ సర్టిఫికెట్ల కోసం కేతన్ సింగ్, విజయ్ కుమార్ లతో వీరన్నస్వామి అగ్రిమెంట్ చేసుకున్నాడు.  వీరన్నస్వామి పంపే వివరాల ఆధారంగా విజయ్ కుమార్, కేతన్ సింగ్ లు సర్వేపల్లి రాధాకృష్ణ యూనివర్శిటీ నుండి నకిలీ సర్టిపికెట్లు తయారు చేసి పంపేవారు. 

విద్యార్ధుల అవసరాలను బట్టి నకిలీ సర్టిపికెట్ల కోసం వీరన్నస్వామి డబ్బులు వసూలు చేసేవాడని పోలీసులు చెప్పారు.ఈ కేసులో మొత్తం 9 మందిని హైద్రాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios