Asianet News Telugu

ప్రసాదం తీసుకెళ్లిన బాలికపై అత్యాచారం..ఆత్మారాం బాబా అఘాయిత్యం..

ఆదిలాబాద్ జిల్లా, నేరడిగొండ మండలంలోని ఇస్పూర్ మథురతండాకు చెందిన బాలికమీద ఓ స్వామీజీ లైంగికదాడికి  పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనలో యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. 

Fake Baba Raped Minor Girl, Case under Pokso Act on Atmaram Maharaj - bsb
Author
Hyderabad, First Published Jun 23, 2021, 10:20 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ఆదిలాబాద్ జిల్లా, నేరడిగొండ మండలంలోని ఇస్పూర్ మథురతండాకు చెందిన బాలికమీద ఓ స్వామీజీ లైంగికదాడికి  పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనలో యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. నేరడిగొండ ఎస్సై భరత్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం దుర్గానగర్ కు చెందిన జాదవ్ ఆత్మారం మహారాజ్ (26) ఏడేల్లుగా రాజుర గ్రామ శవారులోని గుట్టమీద ఆశ్రమం ఏర్పాటు చేసుకుని ఉంటున్నాడు. 

గుట్టమీద శివాలయంలో పూజలు చేయడానికి భక్తులు వెడుతుంటారు. ఎండాకాలం కావడం, ఆ ఆశ్రమం దగ్గర నీటి సౌకర్యం లేకపోవడంతో ఇస్పూర్ మథుర తండా గ్రామస్తులు మహారాజ్ ను గ్రామంలోని ఆలయం దగ్గరున్న ఆశ్రమంలో ఉంచారు. 

ఈనెల 16వ తేదీన రాత్రి 8 గంటల ప్రాంతంలో ఓ బాలికను తల్లిదండ్రులు మహారాజ్ కు ప్రసాదం ఇచ్చిరమ్మని పంపారు. బాలిక వెళ్లి అరగంట తరువాత కూడా తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఆశ్రమానికి వెళ్లి చూశారు. ఆశ్రమం తలుపులు వేసి ఉన్నాయి. స్థానికులు సాయంతో తలుపులు బద్దలు కొట్టారు. 

లోపల బాలిక అపస్మారక స్థితిలో పడి ఉంది. బాలికను ఇంటికి తీసుకెళ్లారు. స్పృహలోకి వచ్చిన తరువాత స్వామీజీ తన మీద అఘాయిత్యం చేశాడని తల్లిదండ్రులకు తెలిపింది. సోమవారం సాయంత్రం బాలిక తల్లిదండ్రులు గ్రామస్తులతో కలిసి నేరడిగొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్థరాత్రి సమయంలో మహారాజ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios