సూర్యాపేటలోని హుజూర్ మండలం అమరవరంలో గుప్త నిధుల కలకలం రేగింది. గుప్త నిధుల పేరుతో ఓ దొంగబాబా ప్రజలను మోసం చేశాడు. మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయంటూ ఓ వ్యక్తిని నమ్మించాడు. అర్థరాత్రి తవ్వితే దొరకుతాయని కూడా చెప్పాడు.

ఆ ఇంటి యజమాని నిజమని నమ్మాడు. అర్థరాత్రి పూట తవ్వకాలు ప్రారంభించి... ఓ మేకను తెచ్చి బలి కూడా ఇచ్చారు. నిధి దొరుకుతుందని మాయమాటలు చెప్పి..రూ.10లక్షలు వసూలు చేశాడు. ఆ డబ్బుతో నాణేలు తీసుకొచ్చి తవ్వకాల్లో బయటపడినట్టు ఆ ఇంటి యజమానిని నమ్మించాడు. 

అయితే.. బాబా వ్యవహార తీరు అనుమానం కలిగించడంతో..పోలీసులకు పిర్యాదు చేశాడు. రంగప్రవేశం చేసిన పోలీసులు 20 కేజీల నాణేలు స్వాధీనం చేసుకుని, దొంగబాబాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.