Asianet News TeluguAsianet News Telugu

ఎయిరిండియాలో ఉద్యోగాల పేరిట ఘరానా మోసం...ఇద్దరి అరెస్ట్

నిరుద్యోగ యువత వీక్ నెస్ ను తమ ఆదాయ వనరుగా మలుచుకున్నారు ఇద్దరు నిందితులు. పెద్ద మల్టీనేషనల్ కంపనీలో ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల నుండి   లక్షల్లో డబ్బులు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడున్నట్లు ఇద్దరు డిల్లీ యువకులను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డిల్లీలో వారిని అరెస్ట్ చేసిన పోలీసులు హైదరాబాద్  కు తరలించారు. 

Fake Airline Job Offers...two people arrested
Author
Hyderabad, First Published Jul 13, 2019, 8:07 AM IST

నిరుద్యోగ యువత వీక్ నెస్ ను తమ ఆదాయ వనరుగా మలుచుకున్నారు ఇద్దరు నిందితులు. పెద్ద మల్టీనేషనల్ కంపనీలో ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల నుండి   లక్షల్లో డబ్బులు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడున్నట్లు ఇద్దరు డిల్లీ యువకులను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డిల్లీలో వారిని అరెస్ట్ చేసిన పోలీసులు హైదరాబాద్  కు తరలించారు.

డిల్లీలోని నోయిడా  ప్రాంతంలో నివాసముంటున్న అమాన్ గౌతం(22), కునాల్  కుమార్(20) జల్సాలకు అలవాటుపడ్డారు. దీంతో ఈజీగా డబ్బులు సంపాదించాలన్న వారికి నిరుద్యోగ యువతను టార్గెట్ చేశారు. పెద్ద కంపనీల్లో ఉద్యోగాలంటే నిరుద్యోగులు ఎంత డబ్బయినా చెల్లించడానికి సిద్దపడతారని వారు గుర్తించారు. దీంతో ఆ పద్దతిలోనే మోసాలకు పాల్పడుతూ డబ్బులు సంపాదించాలని అనుకున్నారు. 

ఈ క్రమంలో వివిధ మార్గాల ద్వారా నిరుద్యోగుల వివరాలు, పోన్ నంబర్లు, మెయిల్ ఐడీలు సంపాదించేవారు. అలా హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడి  నంబర్ కూడా వారి  చేతికి చిక్కింది. దీంతో అతడికి ఎయిర్ ఇండియాలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి దాదాపు లక్ష రూపాయలను ఆన్ లైన్ లోనే వసూలు చేశారు. అయితే డబ్బులు చెల్లించి చాలారోజులు అవుతున్నా వారి నుండి స్పందన లేకపోవడం, పోన్ నంబర్ పనిచేయకపోవడంతో మోసపోయానని గుర్తించిన యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దీంతో రంగంలోకి దిగిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ మోసానికి పాల్పడింది  డిల్లీ  యువకులు గుర్తించారు. దీంతో అక్కడికి వెళ్లిన ఓ టీం స్థానిక  పోలీసుల సాయంతో కునాల్, అమాన్ లను అరెస్ట్ చేశారు. వారి నుండి ఏడు ల్యాప్‌టా‌ప్ లు, 10 మొబైల్‌ ఫోన్లు, కంప్యూటర్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరు ఇంకా ఎవరెవరిని మోసం చేశారన్న దానిపై విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios