న్యూఢిల్లీ: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు చెందిన ఫేస్ బుక్ ఖాతాను తొలగించారు. విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఫేస్‌బుక్ లో ప్రచారం చేసినందుకు ఈ ఖాతాను నిషేధించినట్టుగా ఫేస్ బుక్ ప్రకటించింది.

సోషల్ మీడియా వేదికగా రాజాసింగ్ విద్వేషాన్ని రెచ్చగొట్టేవిధంగా ప్రచారం చేస్తున్నారని గతంలో ఫేష్ బుక్ పై పలు ఫిర్యాదులు అందాయి. ఈ పిర్యాదుల ఆధారంగా ఫేస్ బుక్ ఈ నిర్ణయం తీసుకొంది.

హింసాత్మక, విద్వేషపూరిత, హింసాత్మక సమాచారాన్ని షేర్ చేయరాదనే  తమ నిబంధనల మేరకు ఈ నిర్ణయం తీసుకొన్నట్టుగా ఫేస్ బుక్ ప్రకటించింది.తమ నిబంధనలను ఉల్లంఘించేవారి ఖాతాలను తొలగిస్తామని ఫేస్ బుక్ ప్రకటించింది. మరోవైపు రాజాసింగ్ కు చెందిన ఇన్ స్టాగ్రామ్ ఖాతాను కూడ ఫేస్ బుక్ తొలగించింది.

తన పేరున చాలా ఫేస్ బుక్ ఖాతాలున్నాయని ఆయన ప్రకటించారు. తనకు తెలియకుండానే ఈ రకంగా ఖాతాలు తెరవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. 

తన పేరుతో ఉన్న ఖాతాలను తొలగించడంపై ఆయన ధన్యవాదాలు తెలిపారు. 2018లో తాను తెరిచిన ఫేస్ బుక్ అధికారిక ఖాతా హ్యాక్ గురైందన్నారు. ఈ ఖాతా ప్రస్తుతం కొనసాగం లేదు. ఈ ఖాతాను పునరుద్దరించాలని ఆయన కోరారు. 

ఫేస్ బుక్ అధికారులు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ ముందు ఫేస్ బుక్  అధికారులు హాజరయ్యారు.