Asianet News TeluguAsianet News Telugu

వివాహేతర సంబంధం : ఆర్ఎంపీ కిడ్నాప్ కలకలం.. దొంగచాటుగా టూ వీలర్ మీద తరలిస్తుంటే..

ఓ ఆర్ఎంపీ డాక్టర్ ను ఇద్దరు వ్యక్తులు టూ వీలర్ మీద తరలిస్తుండగా గ్రామస్తులు పట్టుకున్నారు. దీంతో కిడ్నాప్ విషయం వెలుగులోకి వచ్చింది. 

Extra marital relationship : RMP kidnapping In nirmal
Author
First Published Oct 20, 2022, 8:34 AM IST

నిర్మల్ : నిర్మల్ జిల్లాలో ఓ ఆర్ఎంపీ డాక్టర్ కిడ్నాప్ కలకలం రేపింది. వివరాల్లోకి వెడితే.. ఇద్దరు వ్యక్తులు మరో వ్యక్తిని అపహరించి తీసుకువెళుతూ తుపాకీతో పాటు గ్రామస్తులకు పట్టుబడిన సంఘటన ఇది.. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం వంజర్ లో చోటు చేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. దొంగల భయంతో నిత్యం గ్రామంలో రాత్రివేళ గస్తీ తిరుగుతున్నారు.  

మంగళవారం రాత్రి 2 గంటల ప్రాంతంలో గ్రామం నుంచి ఓ ద్విచక్రవాహనంపై ముగ్గురు వ్యక్తులు వెడుతున్నారు. వాహనం నెంబర్ ప్లేట్ లో నెంబర్ కనపడకుండా చేయడంతో గస్తీ తిరుగుతున్న వారికి అనుమానం వచ్చి ఆపారు...పేరు వివరాలు అడగగా డొంకతిరుగుడు సమాధానం చెప్పడంతో పాటు వారి వద్ద 9 ఎంఎం పిస్టల్ ఉండడంతో పోలీసులకు ఉప్పందించారు.  వారు ముగ్గురు వ్యక్తులనూ సారంగాపూర్ ఠాణాకు తరలించారు,

కారణం వెంబడిస్తూ వచ్చి..
ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరూ పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కమ్మర్ ఖాన్ పేటలో ఆర్.ఎం.పీగా పనిచేస్తున్న ఎచిర్యాల రవికుమార్ ను అపహరించి తీసుకు వెళుతూ గ్రామస్తులకు పట్టుబడ్డారు. కిడ్నాపర్ల వద్ద తుపాకీ, రెండు బుల్లెట్లు లభించాయి. అసలు తుపాకీ  వారి వద్దకు ఎలా వచ్చింది? ఎవరిచ్చారు? ఎక్కడ కొన్నారు? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. 

బంధువుల ఇంటికి వచ్చి.. అద్దెకున్న బాలికపై అత్యాచారం.. నిద్రమాత్రలు మింగడంతో..

అయితే, ఆర్ఎంపీ రవికుమార్ సారంగాపూర్ మండలంలోని జౌళి గ్రామానికి చెందిన ఓ మహిళ వద్దకు వచ్చినట్లు స్థానికుల ద్వారా తెలుస్తోంది. వీరు ఇద్దరూ కలిసి మంగళవారం మధ్యాహ్నం అదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని కైలాస్ టేకిడికి కారులో వెళ్తుండగా సదరు మహిళకు మరిదైన బానోతు మారుతి, మరో ఇద్దరు వ్యక్తులు బైక్ మీద వెంబడించి రవికుమార్ ను అపహరించారు. రాత్రి సమయంలో అతడిని తరలిస్తూ వంజర్ గ్రామస్థులకు దొరికిపోయారు. 

ఇదిలా ఉండగా, అక్టోబర్ 17న ముంబైలో ఇలాంటి కిడ్నాపే కలకలం రేపింది. చదువుకోమని తల్లి మందలించడంతో 14 ఏళ్ల బాలిక ఇంటి నుంచి వెళ్లిపోయిన సంఘటన మహారాష్ట్రలోని నాగ్పూర్లో జరిగింది. నాగపూర్ నుంచి పక్క జిల్లా చంద్రాపూర్ కు వెళ్లిన బాలిక తనను కిడ్నాప్ కు గురయ్యారని ఓ కట్టుకథ అల్లింది. పోలీసులు గట్టిగా ప్రశ్నించేసరికి అసలు విషయం బయటపెట్టింది. ఈ కేసు వివరాలను ఆదివారం పోలీసులు వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగపూర్ జిల్లాలోని నందన్ వన్ ప్రాంతానికి చెందిన బాలిక గత శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో చెప్పకుండా.. ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. బస్సులో 150 కిలోమీటర్ల దూరంలోని చంద్రాపూర్ కు సాయంత్రానికి చేరుకుంది. అయితే, ఇంట్లో కూతురుకనిపించకపోవడంతో.. తల్లిదండ్రులు ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. తెలిసిన వారందరినీ, స్నేహితులను, బంధువులను ఆరా తీశారు. అయినా ఆమె గురించి తెలియలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు.  పోలీసులు దీనిమీద మిస్సింగ్ కేసు నమోదు చేశారు

Follow Us:
Download App:
  • android
  • ios