హైదరాబాద్: ప్రియుడిపై మోజులో ఓ మహిళ కన్న కొడుకునే పొట్టన పెట్టుకుంది. భర్తను కాదని మరో వ్యక్తితో ఆమె అక్రమ సంబంధం పెట్టుకుంది. దానికి అడ్డుగా ఉన్నాడని కొడుకును చంపింది. ఈ సంఘటన ఏర్గట్ల మండలం తొర్తి గ్రామంలో చోటు చేసుకుంది. 

తొర్తికి చెదిన నవ్యకు తాళ్రరాంపూర్ గ్రామానికి ెచందిన అభిషేక్ తో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వారికి నాగేంద్ర అనే నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. నవ్య అక్రమ సంబంధం వల్ల దంపతుల మధ్య తరుచుగా గొడవలు జరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో ఇద్దరు విడివిడిగా ఉంటున్నారు 

ఇటీవల ఉపాధి కోసం అభిషేక్ గల్ఫ్ వెళ్లాడు. నవ్య తన కుమారుడితో తల్లిగారింట్లో ఉంటోంది. గురువారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న కుమారుడిని గొంతు నులిమి చంపింది. ఆ తర్వాత ఆగంతకులు అతన్ని చంపినట్లుగా నమ్మించే ప్రయత్నం చేసింది. 

అనుమానంతో పోలీసులు నవ్యను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో నేరం తానే చేసినట్లు అంగీకరించింది. బాలుడి మృతదేహాన్ని తండ్రి తరఫు బంధువులకు అప్పగించారు. అతనికి తాళ్లరాంపూర్ లో అంత్యక్రియలు జరిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.