తప్పతాగి మహిళపై పిఎస్ లోనే కానిస్టేబుల్ అత్యాచారయత్నం

https://static.asianetnews.com/images/authors/2e35a18e-a821-5ed4-a5f6-aacc683fc7cc.jpg
First Published 28, Aug 2018, 7:49 AM IST
Excise constable attempt to rape woman in PS
Highlights

బెల్టు షాపు కేసులో నిందితుడైన తన భర్తకోసం ఎక్సైజ్‌ కార్యాలయానికి వచ్చిన ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. మద్యం మత్తులో ఉన్న ఓ ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ ఆ మహిళపై అత్యాచారయత్నం చేశాడు. 

ఖమ్మం: బెల్టు షాపు కేసులో నిందితుడైన తన భర్తకోసం ఎక్సైజ్‌ కార్యాలయానికి వచ్చిన ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. మద్యం మత్తులో ఉన్న ఓ ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ ఆ మహిళపై అత్యాచారయత్నం చేశాడు. 

ఖమ్మంలోని రంగనాయకగుట్టకు చెందిన ఓ ఆటో డ్రైవర్‌ బెల్ట్‌ షాపును నడుపుతున్నాడు. ఆదివారం రాత్రి అతడి బెల్ట్‌షాపుపై ఎక్సైజ్‌ పోలీసుల దాడి చేసి మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఆటో డ్రైవర్‌ను ఎక్సైజ్‌ స్టేషన్‌కు తరలించారు. 

దాంతో ఆ ఆటోడ్రైవర్‌కు తోడుగా అతడి భార్య కూడా స్టేషన్‌కు వెళ్లింది. ఆదే సమయంలో ఎక్సైజ్‌ కార్యాలయంలోనే కానిస్టేబుల్‌ నరేందర్‌తో పాటు మరో ఇద్దరు మద్యం సేవిస్తున్నారు. 

స్టేషన్‌కు వెళ్లిన తనతో నరేందర్‌ దురుసుగా ప్రవర్తించాడని, తనపై అత్యాచారయత్నం చేశాడని ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నరేందర్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్టు ఎక్సైజ్‌శాఖ సూపరింటెండెంట్‌ సోమిరెడ్డి ప్రకటించారు.

loader