హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. రెహమత్ నగర్ డివిజన్‌లోని ఎస్‌పీఆర్ హిల్స్‌లో ఉన్న దివంగత ప్రధాని ఇందిరా గాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.

అక్కడితో ఆగకుండా విగ్రహం చేయి విరగొట్టి మెడలో టూ లెట్ బోర్డ్ తగిలించారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఘటనాస్థలికి చేరుకుని ఆందోళన నిర్వహించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.