బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్రకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఎద్దేవా చేశారు తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ . అయన పాదయాత్రలో ఎటు చూసినా పచ్చదనమే కనిపించిందని.. అందుకే సంజయ్‌కు ఏమి మాట్లాడాలో తెలియలేదని వినోద్ చురకలు వేశారు 

తెలంగాణ ప్రభుత్వం పట్ల బీజేపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు టీఆర్ఎస్ నేత, తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ అగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్రకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఎద్దేవా చేశారు. అయన పాదయాత్రలో ఎటు చూసినా పచ్చదనమే కనిపించిందని.. అందుకే సంజయ్‌కు ఏమి మాట్లాడాలో తెలియలేదని వినోద్ చురకలు వేశారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

విద్య, వైద్య రంగాల్లో తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరూ చెప్పాల్సిన పని లేదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పడక ముందు 5 మెడికల్ కళాశాలలుంటే ఇప్పుడు 9 కాలేజీలు ఉన్నాయని.. మరో నాలుగు కళాశాలలను ఏర్పాటు చేసే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని వినోద్ కుమార్ వెల్లడించారు. పార్లమెంట్‌లో బండి సంజయ్‌ తెలంగాణ కోసం ఏం మాట్లాడారో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.